Kumaram Bheem Asifabad: పోడు రైతులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే హరీష్‌బాబు
ABN , Publish Date - Jun 12 , 2024 | 10:40 PM
కాగజ్‌నగర్, జూన్ 12 : పోడురైతులకు అండగా ఉంటా మని ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు అన్నారు. బుధవారం మండలంలోని అంకుసాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడారు.

-సిర్పూరు ఎమ్మెల్యే డాక్టర్ హరీష్‌బాబు
కాగజ్‌నగర్, జూన్ 12 : పోడురైతులకు అండగా ఉంటా మని ఎమ్మెల్యే డాక్టర్ హరీష్ బాబు అన్నారు. బుధవారం మండలంలోని అంకుసాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. పోడు రైతులకు పట్టాలున్నప్పటికీ కూడా అటవీశాఖ అధికారులు భూములను తీసు కునేందుకు ప్రయత్నం చేయ టం దారుణమన్నారు. పోడు రైతుల జోలికొస్తే ఊరుకునేది లేదన్నారు. తాతల నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటుండగా ఇప్పుడు పోడు భూములను సర్వే చేస్తామంటూ రైతులను అధికారులు భయభ్రాంతులకు గురిచేయటం సరికాదన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ, వీరభద్రాచారి పాల్గొన్నారు.
బడిబాటను విజయవంతం చేయాలి
బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ హరీష్‌బాబు అన్నారు. బుఽధవారం స్థానికంగా ఏర్పాటు చేసిన బడి బాట కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు నోట్‌బుక్‌లు, పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ బడిబయట ఉన్న పిల్లలను తప్పకుండా బడిలో చేర్పించాలన్నారు. సమావేశంలో తహసీల్దార్ కిరణ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, ఎంఈవో భిక్షపతి, ఆమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సునీత తదితరులు పాల్గొన్నారు.