Share News

Kumaram Bheem Asifabad: నూతన లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలి: ఎస్పీ

ABN , Publish Date - Jan 01 , 2024 | 11:00 PM

ఆసిఫాబాద్‌, జనవరి 1: నూతన లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలని ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో నూతనసంవత్సర వేడుకలు నిర్వ హించి కేక్‌ కట్‌చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

Kumaram Bheem Asifabad:  నూతన లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలి: ఎస్పీ

పదోన్నతి పొందిన ఆఫీసర్‌కు స్టార్‌ పెడుతున్న ఎస్పీ సురేష్‌కుమార్‌

- ఎస్పీ సురేష్‌కుమార్‌

ఆసిఫాబాద్‌, జనవరి 1: నూతన లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాలని ఎస్పీ సురేష్‌కుమార్‌ అన్నారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో నూతనసంవత్సర వేడుకలు నిర్వ హించి కేక్‌ కట్‌చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన సంవత్సరం పోలీసుశాఖలో ఎన్నో నూతన ఒడవడి కలు, అధునాతన సాంకేతికత పరిజ్ఞానానికి శ్రీకారం చుట్టామన్నారు. అవి సిబ్బంది పూర్తిస్థాయి విధి నిర్వహణకు ఎంతో దోహదపడ్డాయన్నారు. లాఅండ్‌ఆర్డర్‌ పోలీ సులు నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలతో మంచి సంబంధాలను కలిగిఉండే అవకాశం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎస్పీలు వెంకటరమణ, కరుణాకర్‌, రమేష్‌, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

పదోన్నతితో బాధ్యత పెరుగుతుంది..

జిల్లాలో సివిల్‌ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఏఎస్సైలుగా పదోన్నతి పొందిన బి రమేష్‌, కె అనిల్‌కుమార్‌, చంద్రశేఖర్‌, సాయిబాబా, జమాల్‌ అహ్మద్‌, వేణుగోపాల్‌ను ఎస్పీ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదో న్నతితో బాధ్యత కూడా పెరుగుతుందన్నారు. బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీసు శాఖపట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా పనిచేయాలని అన్నారు.

Updated Date - Jan 01 , 2024 | 11:00 PM