Share News

Kumaram Bheem Asifabad: ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాం: మంత్రి సీతక్క

ABN , Publish Date - Mar 14 , 2024 | 11:37 PM

కాగజ్‌నగర్‌, మార్చి 14: ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను అమలు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ అన్ని విధాల కృసి చేస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. గురువారం కాగజ్‌నగర్‌ వినయ్‌గార్డెన్‌లో సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌ పార్టీలో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు.

Kumaram Bheem Asifabad: ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాం: మంత్రి సీతక్క

-ఆరుగ్యారంటీలు అమలు జరగటం తథ్యం

-నిరుపేదల సంక్షేమమే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యం

-మాజీ ఎమ్మెల్యే కోనప్ప చేరికతో కాంగ్రెస్‌కు బలం

-సిర్పూరు నియోజకవర్గ సమస్యలను పరిష్కరిస్తా

-జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క

కాగజ్‌నగర్‌, మార్చి 14: ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను అమలు చేసేందుకు కాంగ్రెస్‌ పార్టీ అన్ని విధాల కృసి చేస్తోందని జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. గురువారం కాగజ్‌నగర్‌ వినయ్‌గార్డెన్‌లో సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్‌ పార్టీలో చేరిక సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సాఽధించుకున్న తర్వాత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు జేసిందన్నారు. గడీల పాలన బద్దలు కొట్టి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేస్తోం ది కేవలం కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని తెలిపారు. ఎన్నికల సమయంలో ఆరుగ్యారంటీల పథకాన్ని అమలు చేస్తామని చెప్పామని.. దానిని దశల వారీగా అమలు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నట్టు తెలిపారు. పేద ప్రజల కోసం ప్రాణ త్యాగాలు చేసిన ఇందిరమ్మ కుటుంబానికి రానున్న ఎంపీ ఎన్నికల్లో పట్టం కట్టాలన్నారు. దేవుళ్లతో రాజకీయం చేసే పార్టీ బీజేపీ అన్నారు. ఈ రాజకీయానికి చెక్‌పెట్టాలంటే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కోడ్‌ రాక ముందే మరిన్ని నిధులు కేటాయించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయేందుకు కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తోందన్నారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు కట్టించేందుకు రాష్ట్ర సీఎం ప్రత్యేక చర్యలు తీసు కుంటున్నట్టు వివరించారు. ఇందిరమ్మ రాజ్యం నిరు పేదల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. సిర్పూరు నియోజవర్గ సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామన్నారు. డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌ మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో గెలుపొందేందుకు అంతాకృషిచేయాలన్నారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు మాట్లాడుతూ నిరుపేదలకు న్యాయం కేవలం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. ఈసారి జరిగే ఎంపీ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్‌ను ఆదరించాలన్నారు. సిర్పూరు నియోజకవర్గ ఇన్‌చార్జీ రావి శ్రీనివాస్‌ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కోనప్ప చేరికతో కాంగ్రెస్‌పార్టీకి బలం చేకూరినట్టు ప్రకటించారు.

కాంగ్రెస్‌లో చేరిన కోనేరు కోనప్ప..

బీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను గురువారం మంత్రి సీతక్క కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించింది. అలాగే జడ్పీ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, మున్సిపల్‌ చైర్మన్‌ షహీన్‌ సుల్తానా, వైస్‌ చైర్మన్‌ రాజేందర్‌తోపాటు ఎంపీపీలు, జడ్పీటీసీలు కూడా చేరారు. ఈ సందర్భంగా మాజీఎమ్మెల్యే కోనప్ప మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌, బీఎస్పీ పొత్తు కలువటంతోనే తాను, కార్యకర్తలు పార్టీని వీడినట్టు తెలిపారు. తాను సీఎం రేవంత్‌రెడ్డితో కలిసినసందర్భంలో తానుఎలాంటి పదవిని ఆశించనని కేవలం సిర్పూరు నియోజకవర్గం అభివృద్ధి ఉంటే సరి పోతుందని చెప్పినట్టు తెలిపారు.

అందవెల్లి బ్రిడ్జి పరిశీలన..

కాగజ్‌నగర్‌ అందవెల్లి బ్రిడ్జిన మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? తదితర అంశాలను మాజీ ఎమ్మెల్యే కోనప్పను అడిగి తెలుసుకున్నారు. పనులు ఆగి పోవటంతో 44 గ్రామాలకు రాక పోకలు నిలిచినట్టు మాజీ ఎమ్మెల్యే వివరించారు. త్వరలోనే పనులు ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని సీతక్క ప్రకటించారు. అలాగే సిర్పూరు నియోజకవర్గంలోని సమస్యలను మంత్రి దృష్టికి కోనప్ప తీసుకవచ్చారు. తప్పకుండా దశల వారిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్‌ నుంచి రోడ్డు ద్వారా కాగజ్‌నగర్‌కు వచ్చిన సందర్భంగా చెక్‌పోస్టు వద్ద డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, మాజీఎమ్మెల్యే కోనప్ప, జడ్పీ చైర్మన్‌ కోనేరు కృష్ణారావుతోపాటు నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు.

Updated Date - Mar 14 , 2024 | 11:38 PM