Share News

Kumaram Bheem Asifabad: 7లక్షల కోట్ల అప్పులు ఉన్నా పథకాలు అమలు చేస్తున్నాం

ABN , Publish Date - Apr 07 , 2024 | 10:43 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 7: కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో రూ.7లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, సంవత్సరానికి రూ.70వేల కోట్ల వడ్డీ కడుతున్నా ఇచ్చినమాట ప్రకారం సంక్షేమ పథ కాలు అమలు చేస్తున్నామని పంచాయతీరాజ్‌, గ్రామీ ణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క అన్నారు.

Kumaram Bheem Asifabad:   7లక్షల కోట్ల అప్పులు ఉన్నా పథకాలు అమలు చేస్తున్నాం

- మన వనరులను బీజేపీ కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టుతుండ్రు

- కులాల,మతాల పంచాయతీ తప్ప బీజేపీ పదేళ్లలో చేసిందేమి లేదు

- మంత్రి సీతక్క

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 7: కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వచ్చేసరికి రాష్ట్రంలో రూ.7లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని, సంవత్సరానికి రూ.70వేల కోట్ల వడ్డీ కడుతున్నా ఇచ్చినమాట ప్రకారం సంక్షేమ పథ కాలు అమలు చేస్తున్నామని పంచాయతీరాజ్‌, గ్రామీ ణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో తాటియా గార్డెన్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ బూత్‌స్థాయి ఏజెంట్ల శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ రావడం ఇందిరమ్మ ఇళ్ల ముగ్గులు వేయలేక పోయామని అర్హులైన ప్రతి ఒక్క రికి ఎన్నికల తరువాత ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ ప్రాంతాల్లో మన వనరు లపై అదానీ, అంబానీలకు హక్కులు కల్పిస్తూ ప్రశ్నిం చే వారిని, ఉద్యమకారులను అణిచివేస్తోందని విమ ర్శించారు. మంచినీళ్లకోసం బోర్‌వెల్‌ కూడా వేయనివ్వ కుండా వైల్డ్‌ లైఫ్‌రిజర్వు ఫారెస్టు, టైగర్‌ జోన్‌ పేరుతో మోదీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని మండిపడ్డా రు. రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్‌ అన్నివర్గా లను మోసం చేసిందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని ఎద్దేవా చేశారు. సమావేశంలో జడ్పీచైర్మన్‌ కోనేరు కృష్ణా రావు, జిల్లాఅధ్యక్షుడు విశ్వప్రసాద్‌రావు, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, నాయకులు శ్యాంనాయక్‌, రావిశ్రీనివాస్‌, గణే ష్‌రాథోడ్‌, అనీల్‌గౌడ్‌,బాలేష్‌గౌడ్‌, చరణ్‌, వసంత్‌రావు, మంగ, కృష్ణకుమారి, కళావతి పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీ నిరసన హాస్యాస్పదం..

రైతుల కోసం అంటూ ముసలికన్నీరు కారుస్తూ బీఆర్‌ఎస్‌, బీజేపీలు చేస్తున్న నిరసనదీక్షలు హాస్యాస్ప దమని రాష్ట్ర పంచాయతీరాజ్‌, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో ఆమె మాట్లాడారు. పదేళ్లలో తెలంగాణను విధ్వం సం చేశారని బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కేసీఆర్‌ పాలనలో రైతులు పండించిన పంటలో క్విం టాలుకు 10నుంచి 15కిలోల కోతలు రైతులు మరిచి పోలేదన్నారు. పార్ల మెంట్‌ ఎన్నికల నేపథ్యంలో బీజే పీతో కలిసి రైతుల పక్షాన పోరాడుతున్నట్లు నటిస్తు న్నారని ఆరోపించారు. సోనియా గాంధీ కుటుంబానికి రాష్ట్రంపై ఎంతో ప్రేమఉందని ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని పార్లమెంట్‌లు స్థానాలు కూడా అదేవిధంగా సాధిస్తామన్నారు. కొత్తగా ఇక్కడ హామీలు ఇవ్వాల్సిన అవసరం లేకుం డా అభివృద్ధి కోసం పరితపిస్తున్నా మన్నారు. రాష్ట్రం లో తాముకేవలం ప్రజా సేవలకులమేన న్నారు. పదేళ్లలో రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు విధ్వంసానికి గురయ్యాయని దీనికి నిదర్శనమే కుమరంభీం, వట్టివాగు, కడెం, కాళేశ్వరం ప్రాజెక్టులు అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈప్రాజెక్టులు సరిచేసి ఉంటే రెండు పంటలకు నీళ్లు అందించే అవకాశం ఉండేద న్నారు. అప్పుడు ఈ ప్రాంతంలో పేదరికం లేకుండా చేసే వీలుండేదన్నారు. బీజేపీ దేశంలో కులమతాలను అడ్డుపెట్టుకుని అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ప్రజలు గొప్పవారని తమ పాలకు లను వారే నిర్ణయించుంటారన్నారు. కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌, నాయకులు శ్యాంనాయక్‌, బాలేష్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

ఇఫ్తార్‌ విందులో పాల్గొన్న మంత్రి సీతక్క

ఆసిఫాబాద్‌: ఎంఐఎంపార్టీ ఆధ్వర్యంలో పట్టణం లోని రోజ్‌గార్డెన్‌ ఫంక్షన్‌హలులో ఆదివారం రాత్రి ఏర్పాటుచేసిన ఇఫ్తార్‌ విందులో మంత్రి సీతక్క పాల్గొన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్‌రావు, కాంగ్రెస్‌పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, ఆసిఫాబాద్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ శ్యాంనాయక్‌, మాజీఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్‌, ఎంఐఎం టౌన్‌ అధ్యక్షుడు సల్మాన్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 07 , 2024 | 10:43 PM