Share News

Kumaram Bheem Asifabad: జలపాతాల.. పరవళ్లు

ABN , Publish Date - Jul 21 , 2024 | 10:26 PM

పెంచికలపేట/ఆసిఫాబాద్‌ రూరల్‌, జూలై 21: చుట్టూ పచ్చని చెట్లు... కొండకోనల మధ్య నుంచి పరవళ్లు తొక్కుతూ హోరెత్తే నీటి హొయలు, ప్రకృతి ఒడిలో పాలధారల జాలువారే ఈ జలపాతాలు కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సొంతం.

 Kumaram Bheem Asifabad:   జలపాతాల.. పరవళ్లు

పెంచికలపేట/ఆసిఫాబాద్‌ రూరల్‌, జూలై 21: చుట్టూ పచ్చని చెట్లు... కొండకోనల మధ్య నుంచి పరవళ్లు తొక్కుతూ హోరెత్తే నీటి హొయలు, ప్రకృతి ఒడిలో పాలధారల జాలువారే ఈ జలపాతాలు కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సొంతం. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెంచికలపేటలోని కొండెంగలొద్ద్ది జలపాతం, దొద్దులాయి, ఆసిఫాబాద్‌ మండలం బల్హాన్‌పూర్‌ గ్రామ పంచాయతీలో ఉన్న సమతులగుండం జలపాతాలు హోయలొలి కిస్తు న్నాయి. కొండెంగలొద్ది జలపాతం సుమారు 80మీటర్ల ఎత్తు నుంచి జాలువారుతూ ప్రకృతి ప్రేమికులను ఆహ్వానిస్తోంది. కొండెంగలొద్ది జలపాతం మండల కేంద్రానికి సుమారు 12కిలోమీటర్ల దూరంలో ఉండగా దొద్దులాయి జలపాతం 14కిలోమీటర్ల దూరంలో ఉంది.

Updated Date - Jul 21 , 2024 | 10:26 PM