Share News

Kumaram Bheem Asifabad: ఊపందుకున్న ‘ఉపాధి’ పనులు

ABN , Publish Date - Apr 21 , 2024 | 10:26 PM

బెజ్జూరు, ఏప్రిల్‌ 21: పల్ల్లెల్లో వలసలు నివారించి స్థానికంగా పని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభు త్వం జాతీయ ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో గతంలో కూలీల సంఖ్య తగ్గుముఖం పట్టగా ఏప్రిల్‌ మాసం కావడంతో వీరిసంఖ్య పెరుగుతూ వస్తోంది.

Kumaram Bheem Asifabad: ఊపందుకున్న ‘ఉపాధి’ పనులు

- పెరుగుతున్న కూలీల సంఖ్య

- నీడ కరువు

బెజ్జూరు, ఏప్రిల్‌ 21: పల్ల్లెల్లో వలసలు నివారించి స్థానికంగా పని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభు త్వం జాతీయ ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. జిల్లాలో గతంలో కూలీల సంఖ్య తగ్గుముఖం పట్టగా ఏప్రిల్‌ మాసం కావడంతో వీరిసంఖ్య పెరుగుతూ వస్తోంది. ఎండల తీవ్రత కారణంగా ఉదయం సమ యంలోనే పనులు చేస్తున్నారు. వారం క్రితం ఉన్న కూలీలసంఖ్య ప్రస్తుతం పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

చెరువుల్లో పూడికతీత..

ప్రధానంగా చెరువుల్లో పూడికతీత పనులు చేపడు తున్నారు. వచ్చేది వానాకాలం కావడంతో వర్షంనీరు నిల్వఉండేలా చెరువుల్లో చేరిన మట్టిని పంటపొలా లకు తరలిస్తున్నారు. అక్కడక్కడా కందకాల తవ్వకం, భూమి చదును చేయడం, తదితర పనులు చేపడు తున్నారు. ఏప్రిల్‌ ఒకటి నుంచి ఆర్థిక సంవత్సరం కావడంతో గతంలోనే కొత్తగా పనులు గుర్తించడంతో ప్రస్తుతంఉపాధిపనులు జోరందుకున్నాయి.

ఎండలోనే పనులు..

ఇదివరకు పనిప్రదేశంలో షామియానాలు ఏర్పా టు చేయడంతోపాటు ప్రథమచికిత్స కిట్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచే వారు. ఇప్పుడు ఆ సౌకర్యాలు తొలగించారు. నీటివసతి అంతంత మాత్రంగానే కల్పిస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉండ టంతో కూలీలు పని ప్రదేశంలో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జిల్లాలో జాబ్‌కార్డులు కలిగిన కుటుంబాలు 1,23,423, జాబ్‌ కార్డులోని సభ్యులు 2,47,870, మహి ళలు 1,21,912, పురుషులు 1,28,950, ఉపాధి పనికి హాజరవుతున్న కుటుంబాలు 93,068మంది ఉన్నారు. గ్రామాల్లో పనిచేసే చోట మరిన్ని సౌకార్యలు కల్పిస్తే మరింత హాజరయ్యే అవకాశం ఉందని కూలీలు పేర్కొంటున్నారు.

Updated Date - Apr 21 , 2024 | 10:26 PM