Kumaram Bheem Asifabad గ్రూప్-1 పరీక్షకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: కలెక్టర్
ABN , Publish Date - Jun 07 , 2024 | 10:39 PM
ఆసిఫాబాద్, జూన్ 7: ఈనెల9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీపరీక్షను పకడ్బందీగా నిర్వహించా లని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌లు దీపక్‌తివారి, దాసరివేణు, ఏఎస్పీ ప్రభాకర్‌రావు, ఆర్డీ వోలు లోకేశ్వర్‌రావు, సురేష్, జిల్లాప్రాంతీయ సమన్వ యకర్త లక్ష్మినర్సింహం, డీఎస్పీ సదయ్యతో కలిసి గ్రూప్-1ప్రిలిమనరీ పరీక్షనిర్వహణలో విధులు నిర్వ హించే డిపార్టుమెంట్ అధికారులు, రూట్ అధికా రులు, ఐడెంటిఫికేషన్ అధికారులు, పోలీసు అధికారు లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ వెంకటేష్ దోత్రే
- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, జూన్ 7: ఈనెల9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీపరీక్షను పకడ్బందీగా నిర్వహించా లని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌లు దీపక్‌తివారి, దాసరివేణు, ఏఎస్పీ ప్రభాకర్‌రావు, ఆర్డీ వోలు లోకేశ్వర్‌రావు, సురేష్, జిల్లాప్రాంతీయ సమన్వ యకర్త లక్ష్మినర్సింహం, డీఎస్పీ సదయ్యతో కలిసి గ్రూప్-1ప్రిలిమనరీ పరీక్షనిర్వహణలో విధులు నిర్వ హించే డిపార్టుమెంట్ అధికారులు, రూట్ అధికా రులు, ఐడెంటిఫికేషన్ అధికారులు, పోలీసు అధికారు లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రూప్-1 ప్రిలి మినరీ పరీక్షకు 13కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలి పారు. ఆసిఫాబాద్‌లో 6కేంద్రాలు 1271మంది అభ్య ర్థులు, కాగజ్‌నగర్‌లో 7కేంద్రాలు1512మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతారన్నారు. ఉదయం 9గంటలకే అభ్యర్థులు పరీక్షాకేంద్రాలకు చేరుకోవాల న్నారు. 10గంటల తరువాత పరీక్షాకేంద్రంలోకి అను మతి లేదన్నారు. ఎలకా్ట్రనిక్ పరికరాలు, మొబైల్ ఫోన్‌లు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదన్నారు. పరీక్షాకేంద్రాల వద్ద 144సెక్షన్ అమలుతోపాటు మూడు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే పరీక్ష సమయంలో జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్లు, జిల్లా అధికారులు, ఐడెంటిఫికేషన్, పోలీసుసబంధితశాఖల అధికా రులు పాల్గొన్నారు.