Share News

Kumaram Bheem Asifabad: వారసంతల్లో వసతులు కరువు

ABN , Publish Date - Apr 25 , 2024 | 09:50 PM

చింతలమానేపల్లి, ఏప్రిల్‌ 25: గ్రామాల్లో ఎక్కువగా ప్రజలు వారసంతల్లోనే తమకు కావాల్సిన నిత్యావసర సరకులు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తుంటారు.

 Kumaram Bheem Asifabad:   వారసంతల్లో వసతులు కరువు

- కనీస సౌకర్యాల కల్పించని అధికారులు, నాయకులు

- ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు, వినియోగదారులు

- ఎండలోనే కూరగాయల విక్రయాలు

- సౌకర్యాలు కల్పించాలని ప్రజల డిమాండ్‌

చింతలమానేపల్లి, ఏప్రిల్‌ 25: గ్రామాల్లో ఎక్కువగా ప్రజలు వారసంతల్లోనే తమకు కావాల్సిన నిత్యావసర సరకులు, ఇతర వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. నిత్యం జిల్లాలోని ఏదో ఒక్క మండలంలో వారసంత జరుగుతూ ఉంటుంది. ఈ వారసంతలకు ప్రతీ ఏడాది ఆదాయం వస్తున్నా కనీససౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలం అవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కనీస సౌకర్యాలైన మరుగుదొడ్లు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలి. కానీ చాలా వారసంతల్లో ఇలాంటి సౌకర్యాలు ఎక్కడా కన్పించడం లేదు. వ్యాపారులు సైతం ఎండలోనే రోడ్లపైనే విక్రయాలు జరుపుతుండడంతో వినియోగ దారులు, ప్రజలు అనేక అవస్థలు పడాల్సి వస్తున్నది.

ఏడాదికి సుమారు ఆదాయం..

జిల్లాలోని పలు మండలాల్లో వారసంతలు జరుగు తాయి. వీటికి ప్రతీఏడాది వేలం ద్వారా ఆదాయం సమకూ రుతుంది. ఈ ఆదాయంతో సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. చింతల మానేపల్లి మండలం రవీంద్రనగర్‌లో ప్రతీ శుక్రవారం నిర్వహించే వారసంతకు రూ.3లక్షల ఆదాయం వస్తుంది. గూడెం, చింతలమానేపల్లి మండల కేంద్రాల్లో నిర్వహించే వార సంతలకు రూ.లక్ష చొప్పున ఆదాయం వస్తుంది. అలాగే జిల్లాలోని కౌటాల వారసంతకు రూ.5లక్షలు, వాంకిడి వారసంతకు రూ.9లక్షలు, బెజ్జూరు వార సంతకు రూ.3.5లక్షలు, రెబ్బెన రూ.3.4లక్షలు, జైనూరు వారసంతకు రూ.15లక్షలు, కెరమెరి వారసంతకు రూ.3లక్షలు, సిర్పూర్‌(టి) వారసంతకు రూ.4లక్షలు ఇలా ఆదాయం ప్రతీ ఏడాది సమకూరుతుంది. ఈ ఆదాయంతో వార సంతల్లో కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టడం లేదు.

ఎండలోనే విక్రయాలు..

ఎండలోనే వ్యాపారులు వివిధ రకాల వస్తువులను విక్ర యాలు జరుపుతున్నారు. ఎండవేడిమికి తట్టుకోలేక పోతు న్నామని, షామియానాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని వ్యాపారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రోడ్లపైనే విక్రయాలు జరుగుతుండడంతో వినియోగ దారులు అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్‌ కూడా ఏర్పడి ఇబ్బందులు పడుతున్నారు. ఆటోవాలాలకు పార్కింగ్‌ సౌకర్యం లేకపోవడంతో రోడ్లపైనే ఆటోలు సైతం నిలిపి వేయడంతో ట్రాఫిక్‌ మరింత కష్టమవుతోంది.

అభివృద్ధికి చర్యలు ఇలా..

వారసంతకు వచ్చే ఆదాయంతోపాటు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధుల ద్వారా అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉన్నదని పలువురు పేర్కొంటున్నారు. గ్రామపంచాయతీలు తమ వాటా చెల్లిస్తే అందులో కనీసం 10వంతుల డబ్బుల ఎన్‌ఆ ర్‌ఈజీఎస్‌ నిధుల ద్వారా సమకూరుస్తుంది. ఎన్‌ఆర్‌ఈ జీఎస్‌ పథకం ద్వారా అధికారుల సమన్వయంతో వార సంతల అభివృద్ధికి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతు న్నారు.

కనీస సౌకర్యాలు కల్పించాలి..

- తుమ్మిడె కోటేష్‌, కర్జెల్లి

వారసంతల్లో కనీస సౌకర్యాల కల్పనకు అధికారులు చర్యలు చేపట్టాలి. మరుగుదొడ్లు ఉండేలా చూడాలి. వ్యాపా రులు సైతం ఎండలోనే విక్రయాలు జరుపుతున్నారు. వారసంతలు రోడ్లపైనే ఉండడంతో ఇబ్బందులు పడు తున్నారు. కనీససౌకర్యాలు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలి.

Updated Date - Apr 25 , 2024 | 09:50 PM