Share News

Kumaram Bheem Asifabad: పాఠశాలలు పునఃప్రారంభంలోగా పనులు పూర్తిచేయాలి

ABN , Publish Date - May 20 , 2024 | 10:49 PM

ఆసిఫాబాద్‌, మే 20: విద్యాసంవత్సరం(2024-25)లో పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులు పూర్తిచేసే విధంగా అధి కారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారి అన్నారు.

 Kumaram Bheem Asifabad: పాఠశాలలు పునఃప్రారంభంలోగా పనులు పూర్తిచేయాలి

- అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌, మే 20: విద్యాసంవత్సరం(2024-25)లో పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేలోగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి, మరమ్మతు పనులు పూర్తిచేసే విధంగా అధి కారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారి అన్నారు. సోమ వారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా విద్యాశాఖాధికారి అశోక్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌, జిల్లా గిరిజనఅభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్‌తో కలిసి మండలపరిషత్‌ అధికా రులు, పంచాయతీ అధికారులు, ఐకేపీ ఏపీఎంలు, ఉపాధిహామీ పథకం ఏపీ వోలు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పాఠశాలల అభివృద్ధి పనులు, ఏక రూప దుస్తులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం అమ్మఆదర్శ పాఠశాలల కమిటీ ద్వారా అన్ని ప్రభుత్వపాఠశాలలో అభివృద్ధి పనులు చేపడుతోందన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యేలోగా ఆయా పను లను పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు, మూత్ర శాలలు, విద్యుదీకరణ పనులతోపాటు తరగతిగదుల మరమ్మతులు, బాలిక లకు ప్రత్యేకమూత్రశాలలు పనులు చేపట్టిన పూర్తిచేసే విధంగా చర్యలు తీసు కోవాలన్నారు. పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించేందుకు జిల్లావ్యాప్తంగా దుస్తులతయారీకి 78కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అధికారులు ఆయాకేంద్రాలను పర్యవేక్షిస్తూ పనులను వేగవం తంగా చేసే దిశగా కృషిచేయాలని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద జిల్లాలో చేపట్టిన పనులలో కూలీల హాజరుశాతాన్ని పెంచి పనులు త్వరగా చేసేలా అధికారులు కృషిచేయాలని తెలిపారు. సమాశంలో ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీఎంలు, ఏపీవోలు పాల్గొన్నారు.

Updated Date - May 20 , 2024 | 10:49 PM