Share News

Kumaram Bheem Asifabad: అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పారదర్శకంగా చేపట్టాలి

ABN , Publish Date - May 31 , 2024 | 10:51 PM

కెరమెరి, మే 31: అమ్మఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న పనులు పారదర్శ కంగా చేపట్టాలని కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అన్నారు. శుక్రవారం మండలంలోని మోడి కేజీబీవీపాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు.

Kumaram Bheem Asifabad:  అమ్మ ఆదర్శ పాఠశాలల పనులు పారదర్శకంగా చేపట్టాలి

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

కెరమెరి, మే 31: అమ్మఆదర్శ పాఠశాలల్లో చేపడుతున్న పనులు పారదర్శ కంగా చేపట్టాలని కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అన్నారు. శుక్రవారం మండలంలోని మోడి కేజీబీవీపాఠశాలలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లోని పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటిని సమూలంగా మార్చాలని తెలిపారు. కేజీబీవీ పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, స్నానపు గదులు, డైనింగ్‌హాల్‌, ఇతర మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తున్నామని తెలపారు. ఆయనవెంట డీపీవో భిక్షపతిగౌడ్‌, ఎంపీడీవో అంజద్‌పాషా, తహసీల్దార్‌ దత్తుప్రసాద్‌, ఏఈ నజ్మోద్దీన్‌ తదితరులు ఉన్నారు.

పీడీ యాక్టు నమోదు చేస్తాం..

నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీయాక్టు నమోదు చేస్తామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. శుక్రవారం ఆయన మండలకేంద్రంలోని విత్తనాల దుకాణాలను తనిఖీ చేశారు. ఈసందర్భంగా మాట్లాడుతూ నకిలీ విత్తనాలు అమ్మితే పీడీయాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎంఆర్‌పీ ధరకే విత్తనాలు అమ్మాలని సూచించారు. ఆయనవెంట ఏడీఏ వెంకటి, ఏవో గోపికాంత్‌, తహసీల్దార్‌ దత్తు ప్రసాద్‌రావు తదితరులు ఉన్నారు.

సకాలంలో ఏకరూప దుస్తులు అందించాలి..

జైనూర్‌: విద్యార్థులకు సకాలంలో ఏకరూప దుస్తులు కుట్టివ్వాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. శుక్రవారం ఆయన జైనూరు ఐకేపీ కార్యాలయాన్ని అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఐకేపీ సమాఖ్య కుట్టు మిషన్‌కేంద్రాన్ని వారు సందర్శించి సమాఖ్య సభ్యులు బట్టలు కుడుతున్న తీరును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ సమాఖ్య సభ్యులు స్వయంఉపాధి కోసం కుట్టుశిక్షణ ఏర్పాటు చేయడం, తద్వార లబ్ది పొందడం బాగుందన్నారు. అనంతరం ఐకేపీలో నెలకొన్న సమస్యలు పరిష్కారించాలని సమాఖ్య అధ్యక్షురాలు మోతుబాయి తదితరులు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రేను కోరారు. ఈ సందర్భంగా డీఆర్డీవో పీడీ సురేందర్‌, ఏపీడీ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2024 | 10:51 PM