Share News

Kumaram Bheem Asifabad: సుర్రుమంటున్న ఎండలు

ABN , Publish Date - Apr 07 , 2024 | 10:47 PM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 7: రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండగా జిల్లాలో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరి కలు జారీ చేసింది.

 Kumaram Bheem Asifabad:  సుర్రుమంటున్న ఎండలు

- జిల్లాలో రికార్డు స్థాయిలో నమోదు అవుతున్న ఉష్ణోగ్రతలు

- వడగాలులతో అల్లాడుతున్న జనం

- 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 7: రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండగా జిల్లాలో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చని ఇప్పటికే వాతావరణశాఖ హెచ్చరి కలు జారీ చేసింది. ఆదివారం జిల్లాలో 44.4డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మధ్యాహ్నం ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో జనాలు ఉక్క పోతతో అల్లాడిపోతున్నారు. ఉదయం 9గంటల నుంచే ఎండ అధికమై ఉక్క పోతతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మధ్యాహ్నం రోడ్లన్నీ నిర్మాను ష్యంగా మారుతున్నాయి. ఎండతీవ్రత అధికమవుతుండడంతో ప్రజలు అవసర మైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తాగునీటికోసం మూగజీవాలు అల్లాడుతున్నాయి. చెరువులు, కుంటలు, బావులు అడుగం టుతున్నాయి.

జిల్లాలో 44.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు..

జిల్లాలో ఆదివారం 44.4డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెంచికల పేట మండలంలో 44.4డిగ్రీలు, రెబ్బెన, కాగజ్‌నగర్‌, దహెగాంలలో 43.9డిగ్రీలు, కౌటాలమండలంలో 43.5డిగ్రీలు, తిర్యాణిమండలంలో 43.1 డిగ్రీలు, బెజ్జూరు మండలంలో 42.4డిగ్రీలు, ఆసిఫాబాద్‌లో 42.3డిగ్రీలు, కెరమెరి మండలంలో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

Updated Date - Apr 07 , 2024 | 10:47 PM