Share News

Kumaram Bheem Asifabad: పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది

ABN , Publish Date - May 12 , 2024 | 11:10 PM

సిర్పూర్‌(టి)/చింతలమానేపల్లి/పెంచికలపేట/బెజ్జూరు/కెరమెరి/సిర్పూర్‌(యు)/దహెగాం, మే 12: మండలాల్లోని పోలింగ్‌కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. కొన్ని మండలాల్లో ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

 Kumaram Bheem Asifabad:  పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది

సిర్పూర్‌(టి)/చింతలమానేపల్లి/పెంచికలపేట/బెజ్జూరు/కెరమెరి/సిర్పూర్‌(యు)/దహెగాం, మే 12: మండలాల్లోని పోలింగ్‌కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. కొన్ని మండలాల్లో ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. సిర్పూర్‌(టి) మండల కేంద్రంలోని జిల్లాపరిషత్‌ పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రం-123ని మోడల్‌ పోలింగ్‌ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్‌కేంద్రాన్ని ఆదివారం జిల్లానోడల్‌ అధికారి భిక్షపతిగౌడ్‌, ఏఎస్పీ,అధికారులు సందర్శిం చారు. అలాగే మండలంలోని 29పోలింగ్‌ కేంద్రాలకు పోలింగ్‌ నిర్వహణకు సిబ్బంది సామగ్రితో చేరుకు న్నారు.

చింతలమానేపల్లి మండలంలో మొత్తం 33 పోలింగ్‌కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో ఒకటి బాలాజీ అనుకోడ గ్రామంలోని మోడల్‌ పోలింగ్‌ కేంద్రంను ఏర్పాటుచేసినట్లు అధికారులు వెల్లడిం చారు. బాలాజీ అనుకోడలో మహిళా నిర్వహక పోలింగ్‌ కేంద్రం ఏర్పాటుచేశారు. పోలింగ్‌ కేంద్రా లను డీపీవో భిక్షపతిగౌడ్‌, డీఎల్‌పీవో సురేష్‌ సందర్శించారు.

పెంచికలపేట మండలంలోని 19పోలింగ్‌ స్టేషన్లలుండగా ప్రజాఅవసరాల కోసం మరో రెండు పోలింగ్‌ స్టేషన్లను జైహింద్‌పూర్‌, నందిగాం ఏర్పా టు చేసినట్లు తహసీల్దార్‌ వెంకటేశ్వర్‌రావు తెలి పారు. ఆదివారం మండల కేంద్రంలోని అన్ని పోలింగ్‌కేంద్రాలను సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.

బెజ్జూరు మండలంలో మొత్తం 38పోలింగ్‌ కేంద్రాలు ఉండగా ఒక్కోకేంద్రానికి నలుగురు సిబ్బం ది, ఆరురూట్లలో ఆరుగురు రూట్‌ అధికారులను నియమించారు. మండలంలో 23,884మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పక డ్బందీ చర్యలు చేప ట్టినట్లు తహసీల్దార్‌ భూమేశ్వర్‌ పేర్కొ న్నారు.

కెరమెరి మండ లంలో గతంలో 30 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా అధికారులు వాటిని 41కి పెంచారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి అయిదు గురు ఎన్నికల సిబ్బందిని నియమించారు.

సిర్పూర్‌(యు) మండలంలో ఆదివారం సాయం త్రం ఆయా పోలింగ్‌కేంద్రాలకు ఎన్నికల సిబ్బందికి చేరుకున్నారు. మండలంలో మొత్తం 23పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

దహెగాం మండలంలో సోమవారం నిర్వహించే పార్లమెంట్‌ ఎన్నికల కోసం అధికా రులు పోలింగ్‌ కేంద్రాల సిబ్బందిని ఈవీఎంలను తరలించారు. మండలం లోని ఇట్యాల 254పోలింగ్‌ కేంద్రాన్ని మోడల్‌ పోలింగ్‌ స్టేషన్‌గా ఎంపిక చేసిన అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మండలంలో మొత్తం 26078 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. గతంలో 30 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా అధి కారులు వాటిని 41కి పెంచారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి అయిదుగురు ఎన్నికల సిబ్బందిని వినియోగిం చుకోనున్నారు.

Updated Date - May 12 , 2024 | 11:11 PM