Share News

Kumaram Bheem Asifabad: ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టాలి

ABN , Publish Date - Apr 13 , 2024 | 10:15 PM

రెబ్బెన, ఏప్రిల్‌ 13: త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టాలని జిల్లా ఇన్‌చార్జీ మంత్రి సీతక్క అన్నారు. శనివారం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ

Kumaram Bheem Asifabad: ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టాలి

-జిల్లా ఇన్‌చార్జీ మంత్రి సీతక్క

రెబ్బెన, ఏప్రిల్‌ 13: త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టాలని జిల్లా ఇన్‌చార్జీ మంత్రి సీతక్క అన్నారు. శనివారం మండల కేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఆదిలాబాద్‌ పార్లమెంటు స్థానానికి పోటీచేస్తున్న ఆదివాసీ బిడ్డ సగుణను అత్యధిక మెజార్టీతో గెలిపించి పార్లమెంటుకు పంపించాలని ఆమె అన్నారు. జిల్లా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిని గెల్పించాలన్నారు. ఈసందర్భంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మాజీజడ్పీటీసీ ప్రకాష్‌రావు, నంబాల మాజీ సర్పంచి అమృత, పలువురు నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం గంగాపూర్‌ ఆలయంలో ఆమె పూజలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వ ప్రసాద్‌, నియోజకవర్గ ఇన్‌చార్జీ శ్యాంనాయక్‌, రెబ్బెన పార్టీ అధ్యక్షుడు రమేష్‌, కిషన్‌గౌడ్‌, తిరుపతి పాల్గొన్నారు.

మంత్రికి వినతుల వెల్లువ..

రెబ్బెన మండలానికి పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్కకు అంగన్‌వాడీ టీచర్లు తమ సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాన్ని అందజేశారు.

బజ్జీలు వేసిన మంత్రి సీతక్క..

ఎన్నికల ప్రచారంలో భాగంగా సీతక్క రెబ్బెనలో ప్రచారంచేస్తూ మిర్చిబండి వద్దఆగి బజ్జీలువేసి ఓటర్లను ఆకట్టుకున్నారు. మంత్రి స్థాయి లో ఉండి కూడా బజ్జీలు వేయటంపై మండల వాసులు అభినందించారు.

Updated Date - Apr 13 , 2024 | 10:15 PM