Share News

Kumaram Bheem Asifabad: సాధించిన ప్రగతిని అలాగే కొనసాగించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:17 PM

తిర్యాణి, జూలై 5: జిల్లాలో అభివృద్ధి, సంక్షే మకార్యక్రమాల్లో సాధించిన ప్రగతిప్రస్థానాన్ని అలాగే కొనసాగించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

Kumaram Bheem Asifabad:  సాధించిన ప్రగతిని అలాగే కొనసాగించాలి: కలెక్టర్‌

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

తిర్యాణి, జూలై 5: జిల్లాలో అభివృద్ధి, సంక్షే మకార్యక్రమాల్లో సాధించిన ప్రగతిప్రస్థానాన్ని అలాగే కొనసాగించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. వనమహోత్సవం కార్యక్రమం లో భాగంగా శుక్రవారం తిర్యాణి మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్‌లో ఆయన అద నపు కలెక్టర్‌ దీపక్‌తివారి, జిల్లా అటవీఅధికారి నీరజ్‌కుమార్‌, జిల్లాపంచాయతీ అధికారి సురేందర్‌, వైద్యఆరోగ్య శాఖాధికారి తుకారాం భట్‌తో కలిసి మొక్కలు నాటారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌మాట్లాడుతూ జిల్లాను మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. జీవరాశి మనుగడకు దోహదపడే మొక్కలను నాటి సంరక్షిం చాలన్నారు. అనంతరం నీతిఅయోగ్‌ సంపూర్ణత అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా మండల పరి షత్‌ అధికారి కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీతిఅయోగ్‌లో భాగంగా వెనకబడిన ప్రాంతాల్లో ఆరోగ్యం,విద్య,వైద్యం, వ్యవ సాయం, స్వయంసహాయక సంఘాల అభివృద్ధి, మహిళా శిశుసంక్షేమం సంబంధితఅంశాలపై సంపూర్ణత అభియాన్‌ద్వారా ప్రత్యేకదృష్టి సారిస్తా మన్నారు. ఈ క్రమంలో జిల్లాను సంపూర్ణత అభి యాన్‌ ద్వారా ప్రథమస్థానంలోఉంచేందుకు అధికా రులు సమష్టిగా కృషి చేయాలన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.

అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం..

గిరిజనుల అభివృద్ధికి అన్నిచర్యలు తీసుకుంటు న్నట్లు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే తెలిపారు. జిల్లాలోని తిర్యాణిమండలం పంగిడిమాధరగ్రామంలో ఆయన అదనపుకలెక్టర్‌ దీపక్‌తివారితో కలిసి నల్లాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గిరిజ నుల అభివృద్ధి కోసం అన్నిచర్యలు తీసుకుంటు న్నట్లు తెలిపారు. ఐటీడీఏ ఇస్తున్న రుణాలతోపాటు బ్యాంకులింకేజీ రుణాలుసద్వినియోగం చేసుకోవాల న్నారు.

కలెక్టర్‌కు వింత అనుభవం..

ఆసిఫాబాద్‌/తిర్యాణి: కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రేకు వింత అనుభవం ఎదురైంది. శుక్రవారం ఆయన తిర్యాణిలో వనమహోత్సవం కార్యక్రమం ముగించుకొని వస్తున్నక్రమంలో మండలకేంద్రానికి చెందిన పెందోర్‌ధర్ము మండలంలోని గుండాల- మంగీరోడ్డు, తిర్యాణి-త్రీఇంక్లెయన్‌ వరకు రోడ్లకు మరమ్మతులు చేయాలని కలెక్టర్‌ను వేడుకున్నాడు. కలెక్టర్‌ హామీఇచ్చే వరకు దారికి అడ్డంగా పడుకుని నిరసన తెలిపాడు. ఒకదశలో కలెక్టర్‌ కాళ్లు పట్టు కొని ప్రాధేయపడే ప్రయత్నం చేశాడు. అధికారులు అప్రమత్తమై ఆయనను ఆపారు. దీంతో కలెక్టర్‌ రోడ్డు మరమ్మతులకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇవ్వడంతో కలెక్టర్‌ దారిచ్చాడు.

Updated Date - Jul 05 , 2024 | 11:17 PM