Share News

Kumaram Bheem Asifabad: దడ పుట్టిస్తున్న కూరగాయల ధరలు

ABN , Publish Date - May 26 , 2024 | 10:41 PM

బెజ్జూరు, మే 26: వారం రోజుల వ్యవవధిలోనే ఒక్క సారిగా కూరగాయల ధరలు భగ్గుమంటుండడంతో సామాన్యప్రజలు లబోదిబోమంటున్నారు. దీంతో సామాన్య జనం ఏ కొనాలో, ఏం తినాలో తెలియడం లేదని వాపోతున్నారు.

Kumaram Bheem Asifabad: దడ పుట్టిస్తున్న కూరగాయల ధరలు

బెజ్జూరు, మే 26: వారం రోజుల వ్యవవధిలోనే ఒక్క సారిగా కూరగాయల ధరలు భగ్గుమంటుండడంతో సామాన్యప్రజలు లబోదిబోమంటున్నారు. దీంతో సామాన్య జనం ఏ కొనాలో, ఏం తినాలో తెలియడం లేదని వాపోతున్నారు. మొన్నటివరకు కిలో టమాల రూ.20ఉండగా ఇప్పుడు రూ.50కి చేరింది. అలాగే పచ్చిమిర్చి రూ.120, కారకకాయ రూ.100, దొండకాయ రూ.80, గోరు చిక్కుడు రూ.80,బీరకాయ రూ.100, అలసంద రూ.80, వంకాయ రూ.80కి చేర డంతో మధ్య తరగతి ప్రజలు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పటికే సన్న బియ్యం, పప్పుల ధరలు ఆకాశాన్నండంతో పాటు కూరగాయల ధరలు పోటీ పడి పెరగడంతో పేద ప్రజలు కొనలేని పరిస్థితుల్లో ఉన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవికాలంలో కూరగాయల దిగుబడి అమాంతం తగ్గిపోయింది. కూర గాయల సాగుచేసే రైతులకు పూర్తిస్థాయిలో నీరు అందకదిగుబడి రావడంలేదని రైతులు పేర్కొంటున్నారు. దీంతో వివిధ ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడం రావాణా ఖర్చులు విపరీతంగా పెరిగిన కారణంగా ధరలు పెరిగాయని వ్యాపారులంటున్నారు.

Updated Date - May 26 , 2024 | 10:41 PM