Share News

Kumaram Bheem Asifabad: పార్టీని గ్రామగ్రామాన విస్తరింపజేయాలి

ABN , Publish Date - Feb 01 , 2024 | 10:53 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 1: జిల్లాలో గ్రామ గ్రామాన బీజేపీని విస్తరింపజేయాలని జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

 Kumaram Bheem Asifabad:  పార్టీని గ్రామగ్రామాన విస్తరింపజేయాలి

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, ఫిబ్రవరి 1: జిల్లాలో గ్రామ గ్రామాన బీజేపీని విస్తరింపజేయాలని జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండలాధ్య క్షుడు శ్రీధర్‌ అధ్యక్షతన గావ్‌చలో అభియాన్‌ వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గావ్‌చలో అభియాన్‌ వర్క్‌షాప్‌ని ప్రతిమండలంలో విజయవంతం చేయా లన్నారు. గ్రామగ్రామాన బీజేపీ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలను పార్టీకి చేరువయ్యేలా కార్యాచరణ రూపొందించాల న్నారు. కార్యక్రమంలో జిల్లానాయకులు కాండ్రె విశాల్‌, సొల్లు లక్ష్మి, శ్రీధర్‌, తిరుపతి, శ్రీనివాస్‌, గణేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 01 , 2024 | 10:53 PM