Share News

Kumaram Bheem Asifabad: ‘అరిగెల’ చేరికతో పార్టీకి మరింత బలం

ABN , Publish Date - Apr 18 , 2024 | 10:56 PM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 18: సీనియర్‌ నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు బీజేపీలో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరినట్టయిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

Kumaram Bheem Asifabad: ‘అరిగెల’ చేరికతో పార్టీకి మరింత బలం

బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 18: సీనియర్‌ నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు బీజేపీలో చేరడంతో పార్టీకి మరింత బలం చేకూరినట్టయిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాస్‌ అన్నారు. అరిగెల నాగేశ్వర్‌రావు తన అనుచరగ నంతో ఇటీవల బీజేపీలో చేరి ఆసిఫాబాద్‌కు వచ్చిన సంద ర్భంగా ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌ బాబుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీనియర్‌ నాయకులైన నాగేశ్వర్‌రావు బీజేపీలోకి రావడం చాలా సంతోషకర విషయమ న్నారు. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గొడెం నగేష్‌ గెలుపు కోసం కృషిచేయాలని పేర్కొన్నారు. సిర్పూర్‌ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు మాట్లాడుతూ అరిగెల సోదరులు పార్టీలో చేరడంతో పార్టీ మరింత పటిష్టం కానుంద న్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో పూర్తిగా విఫల మైంద న్నారు. రాష్ట్రంలో బీజేపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించా లన్నారు. జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు మాట్లా డుతూ దేశ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్రధాని మోదీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు బీజేపీలో చేరానన్నారు. రాబోయే పార్ల మెంట్‌ ఎన్నికల్లో ఆసిఫాబాద్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థికి 50వేలమెజార్టీ తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని అందుకు అందరి సహాయ సహ కారాలు ఉండాలన్నారు. ఈ సందర్భంగా అరిగెల బ్రదర్స్‌ను బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌, ఎమ్మెల్యే హరిష్‌ బాబు ఘనంగా సన్మానించారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బీజేపీలోకి చేరిన పలువురు నాయకులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొట్నాక విజయ్‌, మురళీ, విశాల్‌, అంజనేయులుగౌడ్‌, చక్ర పాణి, కిరణ్‌, కృష్ణకుమారి, సొల్లులక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 10:56 PM