Kumaram Bheem Asifabad: పోడుపై పోరుబాట తప్పదు
ABN , Publish Date - Jun 07 , 2024 | 10:29 PM
పోడు వ్యవసాయంలో అటవీ శాఖ అధికారులు తీరుపై పోరుబాట తప్పదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కొంగ సత్యనారాయణ అన్నా రు. శుక్రవారం ఆయన కడంబా అటవీ ప్రాంతాన్ని సందర్శించారు.

-బీజేపీ రాష్ట్రకార్యవర్గ సభ్యుడు కొంగ సత్యనారాయణ
కాగజ్‌నగర్, జూన్ 7: పోడు వ్యవసాయంలో అటవీ శాఖ అధికారులు తీరుపై పోరుబాట తప్పదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు కొంగ సత్యనారాయణ అన్నా రు. శుక్రవారం ఆయన కడంబా అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. తాతాల నాటి నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారిపై కూడా అటవీశాఖ అధికారులు కేసులు బనాయించటం దారుణమన్నారు. ఈ విషయంలో ఊరుకునేది లేదన్నారు. కడంబాలో పోడు వ్యవసాయం చేసే వారిపై తప్పుడు కేసులు నమోదుచేయటం ఎంతవరకు సమంజసమన్నారు. ఇదే గ్రామంలో కొంతమంది రైతులు పోడుభూములకు ప్రహరీపెట్టి పోడు చేస్తున్నా కూడా అటవీశాఖ అధికారులు వత్తాసు పలకటం, మిగితావారిపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడి అక్రమకేసులు పెట్టడమేంటనీ ప్రశ్నించారు. కడంబాలో పనిచేస్తున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారన్నారు. తప్పుడు నిర్ణయాలు చేస్తే ఊరుకోమన్నారు. సమావేశంలో పోడు రైతులు పాల్గొన్నారు.