Share News

Kumaram Bheem Asifabad: ‘పది’ ఫలితాల్లో జిల్లాను ముందంజలో ఉంచాలి: కలెక్టర్‌

ABN , Publish Date - Mar 06 , 2024 | 09:51 PM

ఆసిఫాబాద్‌, మార్చి 6: పదవ తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో ముందంజలో ఉంచే విధంగా అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచే యాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దౌత్రె అన్నారు.

Kumaram Bheem Asifabad:   ‘పది’ ఫలితాల్లో జిల్లాను ముందంజలో ఉంచాలి: కలెక్టర్‌

- కలెక్టర్‌ వెంకటేష్‌ దౌత్రె

ఆసిఫాబాద్‌, మార్చి 6: పదవ తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో ముందంజలో ఉంచే విధంగా అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచే యాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దౌత్రె అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారి, ఆర్డీవో లోకేశ్వర్‌రావు, జిల్లా విద్యాశాఖాధికారి అశోక్‌తో కలిసి పోలీసు, విద్యుత్‌, వైద్య, ఆరోగ్య, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారులతో పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 18నుంచి ఏప్రిల్‌ 2వరకు నిర్వహించే పదవతరగతి పరీక్షలకు 37పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 6,595మంది విద్యార్థులు పరీక్ష లకు హాజరు కానున్నారని పరీక్షల నిర్వహణకు 37 మంది ప్లయింగ్‌స్క్వాడ్‌, మొబైల్‌టీంలను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షాకేంద్రాల సమీపంలోని జీరాక్స్‌సెంటర్లు మూసివేతతోపాటు పోలీసు బందో బస్తు, 144సెక్షన్‌ అమలు చేస్తామన్నారు. రాష్ట్ర రోడ్డు రవాణాసంస్థ అధికారులు ప్రణాళిక బద్దంగా బస్సులు నడిపించాలన్నారు. అత్యవసర వైద్యసేవల నిమిత్తం పరీక్షా కేంద్రాలవద్ద వైద్యఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రాథమికచికిత్స కిట్లతోపాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకేట్లు, అవ సరమైన మందులను అందుబాటులో ఉంచుతూ వైద్య సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాలకు విద్యుత్‌సరఫరా లోపం లేకుండా చర్యలు తీసుకోవడంతోపాటు తాగునీరు, మూత్రశాలలు, పారి శుధ్యనిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేయాలని, చీఫ్‌ ఇన్విజిలేటర్లు ఒకరోజు ముందుగా ఇన్విజిలేటర్లకు తగుసూచనలు అందించాలన్నారు. సమావేశంలో జిల్లాపంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్‌, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి తుకారాంభట్‌, ప్రధా నోపాధ్యాయులు, అధికారులు పాల్గొన్నారు.

మహిళల అభివృద్ధితోనే దేశాభివృద్ధి

మహిళల అబివృద్ధితోనే దేశాభివృద్ధి జరుగు తుందని కలెక్టర్‌ వెంకటేష్‌ దౌత్రె అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్క రించుకుని బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహిం చిన వేడుకలకు అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జిల్లా సంక్షేమ శాఖాధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌తోకలిసి హాజరయ్యారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలలో సహజంగా ఉండేఓర్పు, సహనం కుటుంబాన్ని తీర్చిదిద్దడంతోపాటు సమాజంలోని అన్నిరంగాల్లో రాణించి దేశాభివృద్ధికి పాటుపడాలన్నారు. అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళలు క్రీడలు, ఉద్యోగాలు లాంటి ప్రతిరంగంలో ముందుండాలని జాతీయస్థాయి లో క్రీడారంగంలో నిర్వహించేపోటీలలో పాల్గొని దేశా నికి మంచిపేరు తీసుకురావాలన్నారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ప్రతిమహిళ చదువు, ఉద్యోగం, రాజకీయం, సామాజిక రంగాల్లో రాణించాలన్నారు. ఈ సందర్భంగా పలు పోటీల్లో గెలుపొందిన విజేతలను కలెక్టర్‌, ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో సీడీపీవోలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 06 , 2024 | 09:51 PM