Share News

Kumaram Bheem Asifabad: కోడ్‌ కూసింది..

ABN , Publish Date - Mar 16 , 2024 | 10:24 PM

ఆసిఫాబాద్‌, మార్చి 16: లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగింది. శనివారం నుంచి ఎన్నికలకోడ్‌ అమలులోకి వచ్చింది. లోక్‌సభ ఎన్నికలను ఏడువిడతల్లో నిర్వహించ నుండగా రాష్ట్రంలో నాల్గో విడతలో ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Kumaram Bheem Asifabad:   కోడ్‌ కూసింది..

- లోక్‌సభ ఎన్నికలకు మోగిన నగారా

- మే 3న పోలింగ్‌

- జూన్‌ 4న కౌంటింగ్‌

ఆసిఫాబాద్‌, మార్చి 16: లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగింది. శనివారం నుంచి ఎన్నికలకోడ్‌ అమలులోకి వచ్చింది. లోక్‌సభ ఎన్నికలను ఏడువిడతల్లో నిర్వహించ నుండగా రాష్ట్రంలో నాల్గో విడతలో ఎన్నికలను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ ఏప్రిల్‌18న వస్తుందని ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ ఏప్రిల్‌ 20నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. ఏప్రిల్‌29 వరకు నామి నేషన్ల విత్‌డ్రా ప్రక్రియ పూర్తవుతుందని, మే13న పోలింగ్‌, జూన్‌ 4న ఓట్లలెక్కింపు జరుగనున్నట్లు కేంద్రఎన్నికల సంఘం వెల్లడించింది. ఆసిఫాబాద్‌ జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాలకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారిగా ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ వ్యవహరించనుండగా ఏఆర్‌వోలుగా జిల్లా అదనపుకలెక్టర్‌లు దీపక్‌ తివారి, వేణు వ్యవహరించనున్నారు. జిల్లాలో 4,55,437 మంది ఓటర్లు ఉన్నారు.

ఎన్నికల కోడ్‌ పకడ్బందీగా అమలు చేస్తాం..

దేశంలో జరగనున్న లోక్‌సభ సాధారణ ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో కూడా శనివారం నుంచి ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిందని దానిని పకడ్బందీగా అమలు చేస్తామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఎస్పీ సురేష్‌కుమార్‌, అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి, వేణుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కోడ్‌ వచ్చినం దున నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 18న వస్తుందని మే 13న ఎన్నికలు, జూన్‌ 4న కౌటింగ్‌ ఉంటుందన్నారు. రిటర్నింగ్‌ అధికారిగా ఆదిలాబాద్‌ జిల్లా కలెక్టర్‌ వ్యవహరించనున్నారని అన్నారు. ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకునేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సీవిజిల్‌ యాప్‌ను పకడ్బందీగా అమలు పరుస్తామన్నారు. ఎస్పీ సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు నిర్భయంగా ఓటు వేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేం దుకు కేంద్రబలగాలతో మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించామన్నారు. రూ.50వేల కంటే అదనంగావెంట తీసుకువెళ్తే తప్పనిసరిగా అందుకు సంబంధించిన రశీదు చూపించాల్సి ఉంటుందన్నారు. సమావేశంలో ఏఎస్పీప్రభాకర్‌రావు, డీఎస్పీ కరుణా కర్‌ ఉన్నారు.

Updated Date - Mar 16 , 2024 | 10:24 PM