Share News

Kumaram Bheem Asifabad: ఉపాధ్యాయ సమస్యలపై పోరాటమే లక్ష్యం

ABN , Publish Date - Feb 13 , 2024 | 10:03 PM

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 13: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయ డమే టీఎస్‌యూటీఎఫ్‌ లక్ష్యమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగ య్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎం గార్డెన్‌లో జిల్లా అధ్యక్షు రాలు శాంతికుమారి అధ్యక్షతన నిర్వహించిన జిల్లాస్థాయి విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

Kumaram Bheem Asifabad:  ఉపాధ్యాయ సమస్యలపై పోరాటమే లక్ష్యం

- యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 13: ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేయ డమే టీఎస్‌యూటీఎఫ్‌ లక్ష్యమని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగ య్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎం గార్డెన్‌లో జిల్లా అధ్యక్షు రాలు శాంతికుమారి అధ్యక్షతన నిర్వహించిన జిల్లాస్థాయి విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జీడీ పీలో విద్యారంగానికి కొఠారి కమిషన్‌ నిర్దేశిం చిన మేరకు నిధులు కేటాయించాల్సి ఉన్నప్ప టికీ గత ప్రభుత్వం ఆ పని చేయలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా బడ్జెట్‌లో తక్కువ నిధులు కేటాయించినప్పటకీ గత ప్రభుత్వంతో పోల్చితే వెయ్యికోట్లు అధికంగా కేటాయించడం కొంత సంతోషించదగ్గ విష యమే అన్నారు. ఉపాధ్యా యుల పదోన్నతులు, బదిలీలు లేక ఉద్యోగంపై విసిగిపోయారని అన్నారని ఆవేధన వ్యక్తం చేశారు. 2017లో పదోన్నతులు కల్పించినప్పటికీ అరకొర మాత్ర మేనని ఆరోపించారు. సమావేశంలో ఆ సంఘం నాయకులు ఇందు రావు, ఎల్లయ్య, హేమంత్‌, ఊశన్న, రమేష్‌, దుర్గయ్య, నిరంజన్‌, నారా యణ, తులసీరాం, శ్రీనివాస్‌, మహిపాల్‌, భీమేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 10:03 PM