Share News

Kumaram Bheem Asifabad: ఏడు పేపర్లతో టెన్త్‌ పరీక్షలు

ABN , Publish Date - Jan 03 , 2024 | 10:33 PM

ఆసిఫాబాద్‌, జనవరి 3: విద్యాసంవత్సరం 2023-24నికి పదో తరగతికి సంబంధించి ఏడు రోజులు ఏడు పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన టైం టేబుల్‌ను డిసెంబరు 30న బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యూకేషన్‌ విడుదల చేసింది.

Kumaram Bheem Asifabad:  ఏడు పేపర్లతో టెన్త్‌ పరీక్షలు

- ఈ సారి రెండు పేపర్లుగా సామాన్యశాస్త్రం

- వేర్వేరు రోజుల్లో నిర్వహణకు బోర్డు నిర్ణయం

- మార్చి 18 నుంచి పరీక్షలు

- జిల్లాలో హాజరు కానున్న 6425 మంది విద్యార్థులు

ఆసిఫాబాద్‌, జనవరి 3: విద్యాసంవత్సరం 2023-24నికి పదో తరగతికి సంబంధించి ఏడు రోజులు ఏడు పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షలు మార్చి 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన టైం టేబుల్‌ను డిసెంబరు 30న బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యూకేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్షలు ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.3గంటల వరకు కొనసాగనున్నాయి. సాధారణంగా కరోనాకు ముందు టెన్త్‌లో 11పరీక్షలు జరిగేవి. కరోనా తరువాత 2021-22 సంవత్సరానికి కూడా 11పరీక్షలను నిర్వహించారు. అనంతరం గత సంవత్సం 2022-23ఆరు సబ్జెక్టులకు గాను ఆరు పేపర్లకు కుదించి పరీక్షలు నిర్వహించారు. ఇందులో సామాన్యశాస్త్రం పరీక్షను మాత్రమే రసాయన, భౌతికశాస్త్రం సంబంధించి ఒక పేపర్‌ ఇచ్చి ఆది రాసిన వెంటనే జీవశాస్త్రానికి సంబంధించిన మరో పేపర్‌ ఇచ్చి విద్యార్థులతో వెనువెంటనే పరీక్ష రాయించారు. దీంతో గత సంవత్సరం పదో తరగతి ఫలితల్లో చాలావరకు సామాన్య శాస్త్రం పరీక్షలో విద్యార్థులు ఫెయిల్‌ అయ్యారు. దీంతో ఈ సారి సామన్య శాస్త్రానికి సంబంధించి పరీక్షలు వేర్వేరు రోజుల్లో రెండు పేపర్లుగా నిర్వహించనున్నారు. ఫలితంగా ఈ విద్యాసంవత్సరంలో టెన్త్‌కు ఏడు పరీక్షలు జరగనున్నాయి.

170 స్కూళ్లు.. 6425 మంది విద్యార్థులు..

2023-24 విద్యా సంవత్సరానికి గాను జిల్లాలో 170ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన మొత్తం 6425మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో బాలురు 3224, బాలికలు 3201మంది ఉన్నారు. ఆయా విద్యార్థులు గత సంవత్సరం మాదిరిగా కాకుండా ఈ సారి సామాన్య శాస్త్రం రెండు పేపర్లను వేర్వేరు రోజుల్లో పరీక్ష రాయనున్నారు. దీంతో విద్యార్థులు సులభంగా సామాన్య శాస్త్రం పరీక్ష రాసేందుకు వీలు కలగనుంది.

గతేడాది 76.36 శాతం ఉత్తీర్ణత..

జిల్లాలో గత సంవత్సరం పదవ తరగతి పరీక్షల్లో 76.36 శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులు గత ఏడాది 6628 మంది పరీక్షకు హాజరు కాగా అందులో 5061 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. ఈ ఏడాది పదవ తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

టెన్త్‌ పరీక్షలకు ఏడు పేపర్లు..

- ఎం ఉదయ్‌బాబు, ఇన్‌చార్జి జిల్లా విద్యాధికారి

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఈ ఏడాది ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించేందుకు బోర్డు నిర్ణయించింది. సామాన్య శాస్త్రంలో రెండు పేపర్లుగా పరీక్షను నిర్వహించేందుకు టైం టేబుల్‌ విడుదల చేసింది. జిల్లాలో 6425 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.

Updated Date - Jan 03 , 2024 | 10:33 PM