Share News

Kumaram Bheem Asifabad: విజయవంతంగా ఎన్నికల నిర్వహణ: ఎస్పీ

ABN , Publish Date - May 15 , 2024 | 10:17 PM

ఆసిఫాబాద్‌, మే 15: ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో లోక్‌సభ ఎన్ని కలు శాంతియుత వాతావరణంలో నిర్వ హించడంలో జిల్లా పోలీసు యంత్రాంగం నిర్విరామ కృషిచేసి నట్లు ఎస్పీ సురేష్‌కుమార్‌ తెలి పారు.

 Kumaram Bheem Asifabad: విజయవంతంగా ఎన్నికల నిర్వహణ: ఎస్పీ

వివరాలు వెల్లడిస్తన్న ఎస్పీ సురేష్‌కుమార్‌

ఆసిఫాబాద్‌, మే 15: ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో లోక్‌సభ ఎన్ని కలు శాంతియుత వాతావరణంలో నిర్వ హించడంలో జిల్లా పోలీసు యంత్రాంగం నిర్విరామ కృషిచేసి నట్లు ఎస్పీ సురేష్‌కుమార్‌ తెలి పారు. బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినట్లు తెలి పారు. ఇందులో భాగంగా ప్లయింగ్‌ స్క్వాడ్‌టీంలు, స్ట్రాటిక్‌ సర్వేలైన్స్‌ టీంలు, కండక్ట్‌ కోడ్‌ టీంలు, చెక్‌ పోస్టు ఏర్పాటు చేసి అక్కడ సివిల్‌పోలీసు, స్టాటికల్‌ సర్వేలెన్స్‌ సిబ్బంది, కేంద్రసీఆర్‌పీఎఫ్‌ బలగాలు 24గంటలపాటు వాహనాల తనిఖీ నిర్వహించాయన్నారు. అలాగేజిల్లాలో ఉన్న అధికారులు, సిబ్బంది, మహిళాసిబ్బంది, హోంగార్డులు, ట్రైనింగ్‌ కానిస్టేబుల్‌, ట్రైనింగ్‌ సిబ్బంది, కేంద్ర సీఆర్‌పీఎఫ్‌ బలగాలు మొత్తం 2000మంది అధికారులు, సిబ్బందితో లోక్‌సభ ఎన్నికలకు బందోబస్తు నిర్వహించినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో రూ.2,04,72,950 నగదు స్వాధీనపర్చుకుని 182కేసులు నమోదు చేశామన్నారు. అలాగే 9,588 కిలోల గంజాయితోపాటు 14మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1315లీటర్లమద్యం స్వాధీనపర్చుకున్నామన్నారు. 31కేసుల్లో717 మందిని 107,110,151సీఆర్‌పీసీసెక్షన్ల కింద బైండోవర్‌ చేశామన్నారు. 10 ఎన్‌బీడబ్ల్యూ అమలు, ఇంటర్‌స్టట్‌ 4చెక్‌పోస్టులు, ఇంటర్‌డిస్ట్రిక్‌ 2చెక్‌ పోస్టులు, ఎస్‌ఎస్‌టీ టీంలు 9, ఎఫ్‌ఎస్‌టీ టీంలు 9ఏర్పాటు చేశామన్నారు. 23గ్రామాలు, పట్టణాల్లో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించినట్లు తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, గ్రామాల్లో ఎన్నికలపై ప్రజలకు పోలీసుకళాబృందాల ద్వారా జాన పద కథలు, నాటకాలు, పాటలద్వారా ఓటుహక్కుపై శాంతియుత వాతావ రణం కోసం తీసుకుంటున్న చర్యలపై ప్రజలకు వివరించినట్లు తెలిపారు.

Updated Date - May 15 , 2024 | 10:17 PM