Share News

Kumaram Bheem Asifabad:నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: ఎస్పీ

ABN , Publish Date - May 25 , 2024 | 10:53 PM

కాగజ్‌నగర్‌, మే 25: డీలర్లు, బ్రోకర్లు నకిలీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ సురేష్‌ కుమార్‌ తెలిపారు. శనివారం స్థానిక వినయ్‌గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

 Kumaram Bheem Asifabad:నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: ఎస్పీ

- ఎస్పీ సురేష్‌ కుమార్‌

కాగజ్‌నగర్‌, మే 25: డీలర్లు, బ్రోకర్లు నకిలీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ సురేష్‌ కుమార్‌ తెలిపారు. శనివారం స్థానిక వినయ్‌గార్డెన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోతున్నట్టు తెలిపారు. స్వల్ప లాభాల కోసం ఎవరు కూడా ఈ దందాను ప్రొత్సహించరాదన్నారు. మూడు శాఖల సమన్వయంతో ఈ టాస్క్‌ చేస్తున్నట్టు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ నకిలీ పత్తివిత్తనాలు అమ్మినా ఊరుకునేది లేదన్నారు. పీడీ యాక్టు నమోదు చేస్తామని పేర్కొన్నారు. మహారాష్ట్ర రహదారిపై గట్టి నిఘా పెట్టినట్టు వివరించారు. ప్రత్యేక బృందాలు జిల్లాలో నిత్యం తిరుగుతుంటాయన్నారు. ఆర్డీవో సురేష్‌ నకిలీ విత్తనాలు విక్రయించవద్దన్నారు. ఇన్‌చార్జీ డీఏవో కృష్ణారెడ్డి, ఏడీవో మనోహర్‌, డీఎస్పీ కరుణాకర్‌, సీఐలు, ఎస్సైలు, డీలర్లు, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2024 | 10:53 PM