Share News

Kumaram Bheem Asifabad: విద్యుత్‌ తీగలు అమర్చితే కఠిన చర్యలు

ABN , Publish Date - Feb 13 , 2024 | 10:05 PM

తిర్యాణి, ఫిబ్రవరి 13: వ్యవసాయ పొలాల్లో పంటలకు రక్షణగా, అటవీ జంతు వులను వేటాడేందుకు అడవిలో విద్యుత్‌తీగలు అమర్చితే కఠినచర్యలు తప్పవని రెబ్బెన సీఐ చిట్టిబాబు హెచ్చరించారు.

Kumaram Bheem Asifabad:  విద్యుత్‌ తీగలు అమర్చితే కఠిన చర్యలు

తిర్యాణి, ఫిబ్రవరి 13: వ్యవసాయ పొలాల్లో పంటలకు రక్షణగా, అటవీ జంతు వులను వేటాడేందుకు అడవిలో విద్యుత్‌తీగలు అమర్చితే కఠినచర్యలు తప్పవని రెబ్బెన సీఐ చిట్టిబాబు హెచ్చరించారు. మంగళవారం ఆయన బుగ్గరామన్నగూడెం, కోలాంగూడ, మాణక్యాపూర్‌గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ ప్రవీణ్‌ కూంబింగ్‌ ఆపరేషన్‌లో భాగంగా జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారంలో విధి నిర్వహణలో భాగంగా విద్యుత్‌ తీగలకు తగిలి మృతిచెందడం కలిచివేసిందన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవన్నారు. తిర్యాణి మండలంలో ఎవరైనా విద్యుత్‌తీగలు అమర్చితే పోలీ సులకు సమాచారం అందించాలన్నారు. అనంతరం బుగ్గరమన్నగూడెంలో 50దుప్ప ట్లను పంపిణీ చేశారు. ఆయన వెంట ఎస్సై రమేష్‌, సిబ్బంది ఉన్నారు.

వాంకిడి: విద్యుత్‌తీగ తగిలి మృతిచెందిన గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ ప్రవీణ్‌కు మంగళ వారం మండలకేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైసాగర్‌ ఆధ్వర్యంలో పోలీ సులు సంతాపం ప్రకటించారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వ్యక్తులపై చట్టరిత్యా కఠినచర్యలు తప్పవన్నారు.

కెరమెరి: పంటపొలాల్లో, అటవీప్రాంతాల్లో విద్యుత్‌ తీగలు అమర్చితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై విజయ్‌ అన్నారు. ఇటీవల పాటగూడ, ధనోర గ్రామాల్లో రైతులు చనిపోయారన్నారు. వన్యప్రాణుల కోసం వేటగాళ్లు విద్యుత్‌ తీగలు అమర్చితే పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

Updated Date - Feb 13 , 2024 | 10:05 PM