Kumaram Bheem Asifabad: వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
ABN , Publish Date - Mar 04 , 2024 | 10:37 PM
ఆసిఫాబాద్, మార్చి 4: వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అన్నా రు.
- పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా
ఆసిఫాబాద్, మార్చి 4: వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా అన్నా రు. సోమవారం హైదరాబాద్‌నుంచి ఉన్నతాధి కారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అదనపుకలెక్టర్, జిల్లాఅధికారులతో తాగు నీటి సరఫరాపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వేసవికాలంలో ప్రజలు తాగునీటికిఎలాంటి ఇబ్బం దులు పడకుండా అవసమైన నీటిని అందించేందకు ప్రణాళిక రూపొందించాలన్నారు. సమావేశంలో కాగజ్‌నగర్ డివిజనల్ పంచాయతీ అధికారి సురేందర్, మిషన్ భగీరథ,తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.