Kumaram Bheem Asifabad: కౌటాల ఆసుపత్రిని తనిఖీ చేసిన రాష్ట్ర హెల్త్ డైరెక్టర్
ABN , Publish Date - Aug 11 , 2024 | 11:20 PM
కౌటాల, ఆగస్టు 11: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం అర్ధరాత్రి 12 గంటల తరువాత రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీంద్రనాయక్ డీఎంహెచ్‌వో తుకా రాంభట్‌తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు.
- మంచి భవనం ఉన్నా వైద్యసేవలు అందకపోతే ఎలా?
- వైద్యసేవలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు
- రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీంద్రనాయక్
కౌటాల, ఆగస్టు 11: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం అర్ధరాత్రి 12 గంటల తరువాత రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ రవీంద్రనాయక్ డీఎంహెచ్‌వో తుకా రాంభట్‌తో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు. కౌటాల ఆసుపత్రి గతంలో బెస్ట్ పీహెచ్‌సీగా అవార్డు పొందగా ప్రస్తుతం వైద్యసేవలు అందడం లేదన్న విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖమంత్రి దామోదర రాజనర్సింహ సీరియస్‌గా తీసుకున్నార న్నారు. ఇందుకు తగిన కారణాలు తెలు సుకొని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదే శాలు ఇవ్వగా హెల్త్ డైరెక్టర్ రవీంద్రాయక్ ఫీల్డ్ విజిట్ చేశారు. పీహెచ్‌సీకి వచ్చి రాగానే డెలవరీ రూం, పెషంట్లు చికిత్స పొందే వార్డు, మందుల గది, డాక్టర్‌రూం అన్నీ కలియ తిరిగారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వెనుకబడ్డ ప్రాంతంలో మంచి సౌకర్యాలు కల్పించేందుకు బిల్డింగ్ ఉన్నా సేవలు అందకపోతే ఎలాగని, నాలుగు నెలలుగా ఒక్క సాధారణ డెలవరీ కాకపోవ డానికి ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. మెరుగైన వైద్యసేవలు అందడం సిబ్బంది చేతుల్లోనే ఉందన్నారు. పీహె చ్‌సీలో ఒక స్టాఫ్ నర్సు రిలీవ్ అయిపోతే ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు వైద్య వృత్తిలో సేవకు స్వర్గం లాంటి ప్రదేశమని, కనీస సౌకర్యాలులేకున్నా ప్రజలు చాలా ఓపికతో ఉంటారన్నారు. రాష్ట్రంలో వైద్య సేవలు మెరుగు పరిచేందుకు ప్రభుత్వం పక డ్బందీ చర్యలు తీసుకుంటుందని, రాష్ట్రంలో, జిల్లాల్లో సేవలు మెరుగు పడాల్సిం దేనని స్పష్టం చేశారు. ఆసుపత్రులకు వచ్చే వారితో మర్యాదగా మెలిగి గౌరవంగా ఆత్మీయంగా ఉండాలన్నారు. ఆసుపత్రి పరిస్థితులపై సమాచారం తెలిస్తే ఇంతదూరం వచ్చేవాన్ని కాదన్నారు. ఈ పరిస్థితికి కారణం ఏమిటో ఆలోచన చేయాలని సిబ్బందికి హితవు పలికారు. మూడువందల యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న తనను మరోసారి ఇక్కడికి వచ్చే పరిస్థితులు రానివ్వ కుండా వైద్య సేవలు మెరుగుపర్చాలని ఆదే శించారు. కొవిడ్‌లాంటి విపత్కర పరిస్తితుల్లో అత్యవసరసేవలు చేసి నిరూపించిన వైద్య సిబ్బంది గట్టిగా అనుకుంటే ఏదైనా సాద్య మేననన్నారు. జిల్లాలో 20పీహెచ్‌సీలు ఉండగా ఇందులో కేవలం ఎనిమిది మంది డాక్టర్లే పనిచేస్తున్నారని, ఈ పరిస్థితి మార్చేలా ఖచ్చితంగా చూస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీ నుంచి స్టాఫ్ కోసం డీసీహెచ్‌కి లెటర్ పెట్టాలని డీఎంహెచ్‌వోకు సూచిం చారు. వార్నింగ్ ఇవ్వడం, యాక్షన్ తీసుకోవడం తమ ఉద్దేశం కాదన్నారు. మంత్రి చెప్పిన ట్లుగా పని కావాలన్నారు. పేదలకు సేవలు అందాలి అదే నినా దంతో ముందుకు వెళ్తున్నామని ఇంతకన్నా ఎక్కువ చెప్పేదేమీ లేదన్నారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ అంటూ తన పరిది కాదంటూ కుంటి సాకులతో పేదలకు వైద్యసేవలు అందడంలో నిర్లక్ష్యం చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వైద్యఆరోగ్య శాఖలోని ప్రతిఒక్కరూ పేదప్రజలకు సేవ చేసేందుకే ఉన్నామని గుర్తుంకోవాలన్నారు. ఆసిఫాబాద్ మండలం బండ గూడకి చెందిన ఆత్రం ధర్ముబాయి వాగు దాటే సమయంలో ఆలస్యం అయి పురిటిలోనే శిశువు మృతిచెందిన ఘటన చాలా బాధాకరమన్నారు. ఇటువంటి పరిస్థితి మరోసారి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు. సెకండ్ ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేసేందుకు తన వంతుగా మంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.