Share News

Kumaram Bheem Asifabad: కార్యకర్తలకు అండగా ఉంటా: మాజీ ఎమ్మెల్యే కోనప్ప

ABN , Publish Date - Mar 08 , 2024 | 10:07 PM

కౌటాల, మార్చి 8: కార్యకర్తలకు అండగా ఉంటానని మాజీఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో కోనప్పను కలుసుకున్న కార్య కర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు.

 Kumaram Bheem Asifabad: కార్యకర్తలకు అండగా ఉంటా: మాజీ ఎమ్మెల్యే కోనప్ప

- మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

కౌటాల, మార్చి 8: కార్యకర్తలకు అండగా ఉంటానని మాజీఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలో కోనప్పను కలుసుకున్న కార్య కర్తలనుద్దేశించి ఆయన మాట్లాడారు. కార్యకర్తల అభీష్టం మేరకు నడుచు కుంటానని, కార్యకర్తలకు అండగా ఉంటానని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి కూడా నియోజకవర్గ అభివృద్ధికి హామీ ఇచ్చారని, ముఖ్యంగా గుండాయిపేట వద్ద వంతెన నిర్మాణానికి సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఆయన వెంట ఎంపీపీ నానయ్య, కుమరం మాంతయ్య, బ్రహ్మయ్య, వసంత్‌, తదితరులు ఉన్నారు.

Updated Date - Mar 08 , 2024 | 10:07 PM