Share News

Kumaram Bheem Asifabad: నడిరోడ్డుపైనే ఎస్పీఎం లారీలు

ABN , Publish Date - Feb 07 , 2024 | 10:39 PM

కాగజ్‌నగర్‌, ఫిబ్రవరి 7: కాగజ్‌నగర్‌ ఎస్పీ ఎంకు వచ్చే కర్ర లారీలతో పట్టణవాసులు ఇబ్బం దులు పడుతున్నారు. వర్కర్స్‌ గేటు సమీపంలోని లోడింగ్‌ పాయింట్‌ నుంచి మిల్లులోకి ఒక్కొక్క లారీని లోనికి పంపిస్తారు.

 Kumaram Bheem Asifabad: నడిరోడ్డుపైనే ఎస్పీఎం లారీలు

- ఇబ్బందులు పడుతున్న పట్టణవాసులు

కాగజ్‌నగర్‌, ఫిబ్రవరి 7: కాగజ్‌నగర్‌ ఎస్పీ ఎంకు వచ్చే కర్ర లారీలతో పట్టణవాసులు ఇబ్బం దులు పడుతున్నారు. వర్కర్స్‌ గేటు సమీపంలోని లోడింగ్‌ పాయింట్‌ నుంచి మిల్లులోకి ఒక్కొక్క లారీని లోనికి పంపిస్తారు. బుధవారం కర్రలోడ్‌తో ఎక్కువలారీలు రావటంతో ఎస్పీఎం లోడింగ్‌ పాయింట్‌ నుంచి అరకిలోమీటరు దూరంలో ఉన్న హనుమాన్‌ ఆలయం వరకు లారీలు నిలిచి పోయాయి.లారీలన్నీ రోడ్డపైనేనిలపడంతో మిగతా వాహనదారులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. అధికారులు స్పందించి రోడ్డుపై లారీలు నిలపకుండా చూడాలని పట్టణవాసులు కోరుతున్నారు.

Updated Date - Feb 07 , 2024 | 10:39 PM