Share News

Kumaram Bheem Asifabad: పోచమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Apr 07 , 2024 | 10:41 PM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 7: ఆసిఫాబాద్‌ మండలంలోని అంకుశాపూర్‌ గ్రామంలో ఆదివారం పోచమ్మ ఆలయంలో మహిళలు ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉగాది పర్వదినం కంటే ముందుపోచమ్మ ఆలయాల్లో ప్రత్యేకపూజలు నిర్వహిం చడం ఇక్కడ అనవాయితీ.

 Kumaram Bheem Asifabad:  పోచమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 7: ఆసిఫాబాద్‌ మండలంలోని అంకుశాపూర్‌ గ్రామంలో ఆదివారం పోచమ్మ ఆలయంలో మహిళలు ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉగాది పర్వదినం కంటే ముందుపోచమ్మ ఆలయాల్లో ప్రత్యేకపూజలు నిర్వహిం చడం ఇక్కడ అనవాయితీ. దీంతో పట్టణంతో పాటు మండ లంలోని ఆయాగ్రామాల్లో బోనాలుఎత్తుకొని ఊరేగింపుగా పోచమ్మ ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌ పోచమ్మ గుడిలో ఆదివారం భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. చివరి ఆదివారం కావటంతోభక్తులు ఆలయానికి పోటెత్తారు.దాదాపు మూడు గంటలపాటు తల్లిని దర్శించుకునేందుకు సమయం పట్టింది.

దహెగాం: మండలంలోని లగ్గాం ఆలయంలో మహిళలు ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఉగాది ముందు ప్రత్యేక పూజలు నిర్వహించడం అనవాయితీగా వస్తోంద న్నారు. పూజలను వేదపండితులు శ్రీకాంత్‌చారి ఆధ్వర్యంలో నిర్వహించారు.

Updated Date - Apr 07 , 2024 | 10:41 PM