Kumaram Bheem Asifabad: ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలి: కలెక్టర్
ABN , Publish Date - Nov 28 , 2024 | 10:36 PM
ఆసిఫాబాద్, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రజలఅరోగ్యంపై వైద్యులు, సిబ్బం ది ప్రత్యేకదృష్టి సారించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం కలెక్ట రేట్‌లో అదనపుకలెక్టర్ దీపక్‌తివారితో కలిసి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేం ద్రాల వైద్యులు, సూపర్‌వైజర్లు, ఆరోగ్యకార్యకర్తలతో సమీక్షాసమావేశం నిర్వహిం చారు.

- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ప్రజలఅరోగ్యంపై వైద్యులు, సిబ్బం ది ప్రత్యేకదృష్టి సారించాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం కలెక్ట రేట్‌లో అదనపుకలెక్టర్ దీపక్‌తివారితో కలిసి జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేం ద్రాల వైద్యులు, సూపర్‌వైజర్లు, ఆరోగ్యకార్యకర్తలతో సమీక్షాసమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు వచ్చే ప్రజల ఆరోగ్యంపై వైద్యులు, సిబ్బంది ప్రత్యేకదృష్టి సారించాలని, సమయపాలన పాటించాలని తెలిపారు. తమపరిధిలోని గర్భిణుల వివరాలు, నిర్వహించాల్సిన పరీక్షలు, అవసరమైన మందులు, పోషకాహారం అందించాలని, బాలింతలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రక్తహీనతతో బాధపడే గర్భిణులు, బాలింతలకు సకాలంలో వైద్యం అందించాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో వైద్యసిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. జిల్లాలో క్షయ, కుష్టు, మలేరియా, ఫైలేరియా వంటి వ్యాదులు విస్తరించకుండా నిరోధిం చేందుకు వైద్యాధికారుల సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. అనంతరం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలవారీగా వైద్యసిబ్బందితో సమావేశం ఏర్పాటు చేసుకొని సమీక్షలు నిర్వహించుకోవాలని, ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించే విధంగా కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డాక్టర్ ప్రవీణ్‌రెడ్డి, వైద్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
మెనూ ప్రకారం భోజనం వడ్డించాలి..
ఆసిఫాబాద్‌రూరల్: విద్యార్థులకు మెనూప్రకారం మధ్యాహ్నభోజనం వడ్డిం చాలని కలెక్టర్ వెంకటేష్‌దోత్రే అన్నారు. గురువారం మధ్యాహ్నం జిల్లాకేంద్రం లోని జన్కాపూర్ జడ్పీఉన్నతపాఠవాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సంద ర్భంగా మధ్యాహ్న భోజనం వంటకాలను పరిశీలించారు. నిత్యం మెనూ ప్రకారం పిల్లలకు భోజనం పెట్టాలని ఆదేశించారు. లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉపాధ్యాయు లకు, వంటవారికి పలు సూచనలు చేశారు.