Share News

Kumaram Bheem Asifabad : ‘పది’ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

ABN , Publish Date - Feb 02 , 2024 | 10:32 PM

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 2: వసతిగృహాల వార్డె న్‌లు, ఆశ్రమపాఠశాలల ప్రధానోపాధ్యా యులు పదవతరగతి పరీక్షలు సమీపిస్తున్నం దున విద్యా ర్థులపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు.

 Kumaram Bheem Asifabad :   ‘పది’ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

-అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 2: వసతిగృహాల వార్డె న్‌లు, ఆశ్రమపాఠశాలల ప్రధానోపాధ్యా యులు పదవతరగతి పరీక్షలు సమీపిస్తున్నం దున విద్యా ర్థులపై ప్రత్యేకశ్రద్ధ వహించాలని అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాల వార్డెన్‌లు, ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో పదవతరగతి వారీక్షపరీక్షలపై సమీక్షా సమావేశం నిర్వహిం చారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి18నుంచి 29వరకు జరగనున్న పది పరీ క్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణతసాధించేలా కృషి చేయా లని తెలిపారు. వసతిగృహాలు, ఆశ్రమపాఠశా లల్లో చదివేవిద్యార్థులపై ప్రత్యేకదృష్టిసారిం చాల న్నారు. వందశాతం ఉత్తీర్ణతసాధించేలా చూడాల న్నారు. సబ్జెక్టులలో వెనకబడ్డ విద్యార్థులపై ప్రత్యే కశ్రద్ధ వహించాలన్నారు. అల్ఫాహారం, స్నాక్స్‌, భోజనం సమయానికి అందిస్తూ ప్రత్యేక తరగ తులు నిర్వహించాలన్నారు. నిర్లక్ష్యం వహించే వారిపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. వసతి గృహాల సంక్షేమాధికారులు, విద్యార్థులను పాఠశా లలకు సకాలంలో పంపించాలన్నారు. సమావేశం లో గిరిజనసంక్షేమాధికారిణి రమాదేవి, షెడ్యూల్‌ కులాల సంక్షేమశాఖాధికారి సజీవన్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 02 , 2024 | 10:32 PM