Share News

Kumaram Bheem Asifabad: పోలీసు అబ్జర్వర్‌ను కలిసిన ఎస్పీ

ABN , Publish Date - Apr 25 , 2024 | 09:46 PM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 25: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పోలీసు అబ్జర్వర్‌ రాజేష్‌కుమార్‌ సక్సెనాను గురు వారం ఎస్పీ సురేష్‌కుమార్‌ మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అంద జేశారు.

Kumaram Bheem Asifabad:   పోలీసు అబ్జర్వర్‌ను కలిసిన ఎస్పీ

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 25: పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పోలీసు అబ్జర్వర్‌ రాజేష్‌కుమార్‌ సక్సెనాను గురు వారం ఎస్పీ సురేష్‌కుమార్‌ మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్కను అంద జేశారు. ఈ సందర్భంగా జిల్లాలో స్ట్రాంగ్‌ రూం వద్ద బందోబస్తు, భద్రత ఏర్పా ట్లకు సంబంధించిన వివరాలను అబ్జర్వర్‌కు తెలియజేశారు. ఈ సందర్భగా తీసుకుంటున్న భద్రత చర్యల గురించివివరించారు. శాంతియుత వాతావరణం లో ఎన్నికలు జరగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలియజే శారు. అన్నిపట్టణ, గ్రామాల్లో ప్రతిరోజు వాహనాల తనిఖీతోపాటు ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించామని తెలియజేశారు. అలాగే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో స్పెష్టల్‌ పార్టీ, గ్రేహౌండ్స్‌ దళాలతో నిరంతరం కూంబింగ్‌ ఆపరేషన్‌, గస్తీ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.

Updated Date - Apr 25 , 2024 | 09:46 PM