Share News

Kumaram Bheem Asifabad: నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలి

ABN , Publish Date - Mar 24 , 2024 | 10:44 PM

ఆసిఫాబాద్‌, మార్చి 24: నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ రమేష్‌ అన్నారు. ఆది వారం జిల్లా కేంద్రంలోని ప్రత్యేక సబ్‌జైలులో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు జైలు సూపరింటెండెంట్‌ ప్రేంకుమార్‌తో కలిసి హాజరై ఖైదీలకు అవగాహన కల్పించారు.

Kumaram Bheem Asifabad:  నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలి

- జిల్లా ప్రధాన న్యాయాధికారి ఎంవీ రమేష్‌

ఆసిఫాబాద్‌, మార్చి 24: నేర ప్రవృత్తికి దూరంగా ఉండాలని జిల్లా ప్రధాన న్యాయాధికారి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్‌ రమేష్‌ అన్నారు. ఆది వారం జిల్లా కేంద్రంలోని ప్రత్యేక సబ్‌జైలులో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు జైలు సూపరింటెండెంట్‌ ప్రేంకుమార్‌తో కలిసి హాజరై ఖైదీలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధానన్యాయాధికారి, జిల్లా న్యాయసేవాధికార సంస్థచైర్మన్‌ మాట్లాడుతూ ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగా లని అన్నారు. తెలిసో తెలియకో క్షణికావేశంలో తప్పులు చేసి జైలులో ఉన్న వారు, న్యాయవాదిని నియమించుకోని స్థోమతలేని వారు, న్యాయ సేవా ధికార సంస్థనుంచి ఉచితన్యాయసహాయాన్ని పొందవచ్చన్నారు. బ్రహ్మకుమారి ఆర్తి ఖైదీలకు రాజయోగ మెడిటేషన్‌పై శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో జైలు అధికా రులు పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 10:44 PM