Share News

Kumaram Bheem Asifabad: కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా షాహిన్‌ సుల్తానా

ABN , Publish Date - Mar 04 , 2024 | 10:43 PM

కాగజ్‌నగర్‌, మార్చి 4: కాగజ్‌నగర్‌ 19వ వార్డుకు చెందిన షాహిన్‌సుల్తానాను మున్సిపల్‌ చైౖర్‌పర్సన్‌గా, 15వవార్డు కౌన్సిలర్‌ స్వామిషెట్టి రాజేందర్‌ను వైస్‌చైౖర్మన్‌గా సోమవారం మిగితా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Kumaram Bheem Asifabad: కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా షాహిన్‌ సుల్తానా

వైస్‌చైర్మన్‌గా రాజేందర్‌ ఏకగ్రీవ ఎన్నిక

కాగజ్‌నగర్‌, మార్చి 4: కాగజ్‌నగర్‌ 19వ వార్డుకు చెందిన షాహిన్‌సుల్తానాను మున్సిపల్‌ చైౖర్‌పర్సన్‌గా, 15వవార్డు కౌన్సిలర్‌ స్వామిషెట్టి రాజేందర్‌ను వైస్‌చైౖర్మన్‌గా సోమవారం మిగితా కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ కౌన్సిలర్లతో ఆర్డీవో సురేష్‌ సమావేశం ఏర్పాటుచేశారు. నూతనచైర్మన్‌గా కోసం 19వ వార్డుకు చెందిన షాహిన్‌ సుల్తానాను తాను ప్రతిపాదిస్తున్నట్టు కౌన్సిలర్‌ శివప్రసాద్‌ ప్రకటించగా, విద్యావతి బలపరుస్తున్నట్టు తెలిపారు. ఇందుకు పాలకవర్గ సభ్యుల్లో 25మంది ఒకేసారి చేతులెత్తారు. దీంతో చైర్‌పర్సన్‌గా షాహిన్‌ సుల్తానా ఎంపికైనట్టు ప్రత్యేకఅధికారి ప్రకటించారు. అలాగే వైస్‌చైర్మన్‌ కోసం వార్డు నెం.15 రాజేందర్‌ను తాను ప్రతిపాదిస్తున్నట్టు కౌన్సిలర్‌ జయచందర్‌ తెలిపారు. అలాగే బంక శివ కౌన్సిలర్‌ బలపరుస్తున్నట్టు తెలుపగా 21మంది కౌన్సిలర్లు చేతులెత్తి మద్దతు పలికారు. కేవలం నలుగురు కౌన్సిలర్లు మద్దతు పలుకకుండా బయటికి వెళ్లిపోయారు. అనంతరం ప్రత్యేక అధికారి ఆర్డీవో మాట్లాడుతూ మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌గా రాజేందర్‌ను ఎన్నికైనట్టు ప్రకటించారు. తొలుతచైర్‌పర్సన్‌కు ప్రమాణస్వీకారం చేయించి సంత కం తీసుకున్నారు. అనంతరం వైస్‌చైర్మన్‌కు కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. మున్సిపల్‌చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ఎన్నిక ఉండటంతో కాగజ్‌నగర్‌ పట్టణ సీఐ శంకరయ్య, రూరల్‌ సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.

తొలి మైనార్టీమున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా

షాహిన్‌ సుల్తానా

కాగజ్‌నగర్‌ మున్సిపాల్టీ చైర్‌పర్సన్‌గా మైనార్టీ వర్గానికి చెందిన షాహిన్‌ సుల్తానా తొలిసారిగా ఎంపికయ్యారు. దీంతో అందరూ ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.

అంబరాన్నంటిన సంబరాలు..

కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ ఎంపికైన తర్వాత బీఆర్‌ఎస్‌నాయకులు పెద్దఎత్తున రంగులు చల్లుకుంటూ సంబరాలు జరిపారు. ఈ సంబరాల్లో కోనేరు చారిటబుల్‌ ట్రస్టు చైర్మన్‌ కోనేరు వంశీ, కోనేరు ఫణి, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నేరుగా మాజీ ఎమ్మెల్యే కోనప్ప నివాసానికి వెళ్లి కోనప్ప సతీమణి కోనేరు రమాదేవిని కలిశారు. ఈ సందర్భంగా మిఠాయిలు తిన్పించి శుభాకాంక్షలు తెలిపారు. చైర్‌పర్సన్‌గా, వైస్‌చైర్మన్‌గా తమ ఎంపికకు మద్దతు పలికిన మాజీ ఎమ్మెల్యే కోనప్ప, జడ్పీ ఇన్‌చార్జీ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు, కౌన్సిలర్లందరికీ, బీఆర్‌ ఎస్‌ పార్టీ నాయకులందరికీ షాహీన్‌ సుల్తానా, రాజేందర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Mar 04 , 2024 | 10:43 PM