Share News

Kumaram Bheem Asifabad : పండుగ వాతావరణంలో పాఠశాలలను ప్రారంభించాలి: కలెక్టర్‌

ABN , Publish Date - May 30 , 2024 | 10:56 PM

ఆసిఫాబాద్‌, మే 30: పండుగ వాతావర ణంలో పాఠశాలలను ప్రారంభించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

Kumaram Bheem Asifabad :  పండుగ వాతావరణంలో పాఠశాలలను ప్రారంభించాలి: కలెక్టర్‌

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, మే 30: పండుగ వాతావర ణంలో పాఠశాలలను ప్రారంభించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో మండల, జిల్లా సమైక్య అధ్యక్ష, కార్యదర్శులు, సెర్ప్‌, మెప్మా సిబ్బందితో నిర్వహించిన సమావే శంలో ఆయన అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి, డీఈవో అశోక్‌, గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షు రాలు త్రివేణితో కలిసి పాల్గొన్నారు. ఈనెల 3నుంచి 19వరకు బడిబాట కార్యక్రమం నిర్వ హించాలని తెలిపారు. బడిబాటను కేవలం ఒక కార్యక్రమంలా భావించవద్దని తెలిపారు. ప్రతిపిల్లోడిని స్కూల్లో చేర్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలన్నారు. బడి బయట పిల్లలను బడిలోకి తీసుకురావడమే కాకుండా విద్యార్థుల సంఖ్య పెంచడమే బడి బాట కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో జిల్లాలోని అన్నిప్రభుత్వ పాఠశాలలన్నీ ప్రైవే టు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ప్రతిపాఠశాలలో తాగునీరు, విద్యు త్‌, టాయిలెట్లు వంటి మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యతోపాటు 6నుంచి 10వతరగతి పిల్లలకు నోటుపుస్తకాలు, 1 నుంచి 5వతరగతి విద్యార్థులకు వర్క్‌బుక్‌ లు, యూనిఫాం అందిస్తున్నట్లు తెలిపారు. ఉదయంపూట బలవర్ధకమైన అల్పా హారం, రాగిజావ, మధ్యాహ్నం భోజనం అందిసు ్తన్నట్లు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పదవతరగతితరువాత ఇంటర్‌, ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించాలనుకునే వారికి ప్రభు త్వం ఎన్నోవెసులుబాట్లను కల్పి స్తోంద న్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం కల్పి స్తున్న పథకాలను విద్యార్థులకు, వారి తల్లి దండ్రులకు వివరించాలన్నారు. పాఠశాల ప్రారంభానికి సమయం దగ్గర పడుతోందని, ప్రతిపాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావ రణం కల్పించడంతోపాటు సుందరీకరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశిం చారు. బడికి పిల్లలు భయంతో కాకుండా ఉత్సాహంగావచ్చేలా చూడాలన్నారు. జూన్‌ 12న ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదం డ్రుల సమక్షంలో పాఠశాలలను పండుగ వాతావరణంలో ప్రారంభించాలన్నారు. కార్య క్రమంలో జిల్లాసంక్షేమాధికారి భాస్కర్‌, అడి షనల్‌ప్రాజెక్టుడైరెక్టర్‌ రామకృష్ణ పాల్గొన్నారు.

Updated Date - May 30 , 2024 | 10:56 PM