Kumaram Bheem Asifabad: మొక్కలు నాటి సంరక్షించాలి
ABN , Publish Date - Jul 28 , 2024 | 10:55 PM
సిర్పూర్(టి), జూలై 28: మొక్కలు నాటి సంర క్షించాలని ఎస్సై దీకొండ రమేష్, ఎంపీడీవో సత్యనా రాయణ అన్నారు. ఆదివారం ప్రభుత్వజూనియర్ కళాశాలలో వారుమొక్కలు నాటారు.

సిర్పూర్(టి), జూలై 28: మొక్కలు నాటి సంర క్షించాలని ఎస్సై దీకొండ రమేష్, ఎంపీడీవో సత్యనా రాయణ అన్నారు. ఆదివారం ప్రభుత్వజూనియర్ కళాశాలలో వారుమొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎఫ్‌ఆర్వో పూర్ణచందర్, ఏపీవో చంద్రయ్య, ఎఫ్‌ఏ రాజేశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు.
చింతలమానేపల్లి: మండలంలో ఆదివారం వనమహోత్సవంలో భాగంగా ఎంపీడీవో ప్రసాద్ తదితరులు మొక్కలు నాటారు. ముసలమ్మ గుట్ట ప్రాంతం, శ్రీకృష్ణ ఆశ్రమంవద్ద వనమహోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడు తూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో అటవీశాఖాధికారులు బానేస్, ఏపీవో గోవర్ధన్, ఈసీ అనిల్, కార్యదర్శి ఆసిఫ్ అలీ, ఇస్తారి, అటవీశాఖ అధికారులు మోహన్, ప్రసాద్, సూర్య నారాయణ, ప్రసాద్, రాజేష్, లచ్చన్న, నాయకులు నానయ్య, తదితరులు పాల్గొన్నారు.
బెజ్జూరు: వనమహోత్సవంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించాలని హైదరాబాద్ దూలపల్లి పారెస్టు అకాడమీ కోర్సుఅసిస్టెంట్ డైరెక్టర్ రామ్మో హన్ అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని జిల్లాపరిషత్ పాఠశాలలో వనమహోత్సవం సంద ర్భంగా మొక్కలునాటారు. కార్యక్రమంలో రేంజ్ అధికారి దయాకర్, శ్రావణ్, బీట్ అధికారి అనిత తదితరులు పాల్గొన్నారు.
రెబ్బెన: ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని డిప్యూటీ ఎఫ్‌ఆర్వో శ్రీధర్‌చారి అన్నారు. ఆది వారం గంగాపూర్‌లో వనమహోత్సవ కార్యక్రమం లో ఆయనమాట్లాడారు. మొక్కలు నాటడంతో రానున్న భావితరాల వారికి వాతావరణంలో సమతుల్యత ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శంకరమ్మ, సెక్షన్ అధికారి ఎం కొమ్మలు, రవీందర్, ఫారెస్టు బీట్ అధికారులు స్వాతి, శ్రీలత, ఏపీవో పంచాయతీ కార్యదర్శులు కస్తూర్బాగాంధీ విద్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
వాంకిడి: నాటినమొక్కలను సంరక్షించుకోవా లని తహసీల్దార్ రియాజ్‌అలీ, ఎంపీడీవో నస్రుల్లా ఖాన్ పేర్కొన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నతపాఠశాలలలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. కార్య క్రమంలో పీఏసీఎస్ చైర్మన్ పెంటు, ఎంపీవో అజీజుద్దీన్, ఏపీఎం మహేష్, ఏపీవో శ్రావణ్, కార్యదర్శి శివ, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
పెంచికలపేట:మొక్కల పరిరక్షణ ప్రజలందరి బాధ్యత అని ఎంపీడీవో ఆల్బర్ట్, ఎఫ్‌ర్వో సుధాకర్ అన్నారు. చెడ్వాయి పాఠశాలలో వనమహోత్సవం లో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
కెరమెరి: నాటిన ప్రతిమొక్కను సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలని మాజీజడ్పీటీసీ ధ్రుపతా బాయి అన్నారు. ఆదివారం మోడిగ్రామంలో వన మహోత్సవంలో భాగంగా మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో అంజద్‌పాషా, ఎఫ్‌ఆర్వో మజారోద్దీన్, ఏపీవో మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
తిర్యాణి: మొక్కలునాటి వాటిని సంరక్షించాలని మాజీ జడ్పీటీసీచంద్రశేఖర్, మాజీఎంపీపీ శ్రీదేవి, అటవీశాఖాధికారి శ్రీనివాస్‌లు అన్నారు. ఆదివారం ప్రభుత్వ కళాశాలలో మొక్కలు నాటారు. కార్యక్ర మంలో రాజయ్య, మధుకర్, అటవీ అధికారులు ప్రవీణ్, సంతోష్, మహేందర్, రాంసింగ్, సత్యనా రాయణ, శ్రీనివాస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
జైనూర్/ సిర్పూర్(యు): మొక్కలను కాపా డేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని ఫారెస్ట్ రేంజ్‌అధికారి జ్ఞానేశ్వర్ కోరారు. మండంలోని సిర్పూర్(యు), జైనూర్‌లలో ఆయన వనమహో త్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రవీణ్, కెజీబీవీ ప్రిన్సిపాల్ ఎంపీవో ప్రభుదయ, ఉపాధి సిబ్బంది, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.