Share News

Kumaram Bheem Asifabad: పాఠశాలల మరమ్మతులు సత్వరమే పూర్తి చేయాలి

ABN , Publish Date - Jun 11 , 2024 | 10:13 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌/వాంకిడి, జూన్‌ 11: అమ్మఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వం పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు.

Kumaram Bheem Asifabad:  పాఠశాలల మరమ్మతులు సత్వరమే పూర్తి చేయాలి

- అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి

ఆసిఫాబాద్‌ రూరల్‌/వాంకిడి, జూన్‌ 11: అమ్మఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో ప్రభుత్వం పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. మంగళవారం ఆసిఫాబాద్‌ మండలంలోని అడ గ్రామ పరిధిలోగల వాడిగూడ, ఈదులవాడ, వాంకిడి మండలంలోని ఘాట్‌జంగం, మడోక ర్‌వాడ, గోయగాం పాఠశాలల్లో అమ్మఆదర్శ పాఠశాల క్రింద ప్రభుత్వం పాఠశాలల్లో చేపట్టిన పనుల పురోగతిని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, డివిజనల్‌ పంచాయతీ అధి కారి ఉమర్‌హుస్సేన్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతుం డడంతో పాఠశాలల్లో మిగిలిఉన్న మరమ్మతు పనులను వేగంగా పూర్తిచేయాలని అధి కారులను ఆదేశిం చారు. ముఖ్యంగా పాఠశాలల్లో తాగు నీరు, విద్యుత్‌, టాయిలెట్లు, శాని టేషన్‌, ఫ్యాన్ల ఏర్పా టు వంటి పనులు సత్వరమే పూర్త య్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.

పాఠశాలల గదులు శుభ్రపర్చాలని, ఆవరణలో ఉన్న చెత్తను, శిథిలాలను తొలగిం చాలని తెలిపారు. విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదువుకునేలా చూడా లన్నారు. నూతన విద్యాసంవత్సరం ప్రారంభమవుతుం డడంతో విద్యార్థులకు అవసరమైన ఏకరూప దుస్తులు,పుస్తకాలు వెంటనే వారికి అందించే దిశగా కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీ వోలు, ఇంజనీరింగ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2024 | 10:13 PM