Share News

Kumaram Bheem Asifabad: కౌంటింగ్‌కు పూర్తి ఏర్పాట్లతో సిద్ధం

ABN , Publish Date - May 31 , 2024 | 10:53 PM

ఆసిఫాబాద్‌, మే 31: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మే13న జరిగిన పోలింగ్‌కు సంబం ధించిన కౌంటింగ్‌కు పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే తెలిపారు.

 Kumaram Bheem Asifabad: కౌంటింగ్‌కు పూర్తి ఏర్పాట్లతో సిద్ధం

- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, మే 31: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా మే13న జరిగిన పోలింగ్‌కు సంబం ధించిన కౌంటింగ్‌కు పూర్తిస్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రం లోని తెలంగాణ సాంఘికసంక్షేమ రెసిడెన్షియల్‌ బాలికల ఎడ్యూకేషన్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో ఏర్పాటు చేసిన కౌంటింగ్‌కేంద్రాన్ని ఆదిలాబాద్‌ కలెక్టర్‌, రిటర్నింగ్‌అధికారి రాజర్షిషా, ఎస్పీ గౌస్‌ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, అదనపు కలెక్టర్‌ దీపక్‌తివారి, దాసరివేణుతో కలిసి పరిశీలిం చారు. ఈసందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి జరిగిన ఎన్నిక లకు సంబంధించి ఓట్లలెక్కింపు ప్రక్రియ కొరకు కౌంటింగ్‌ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కుమరంభీం జిల్లాలోని సిర్పూ ర్‌, ఆసిఫాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్‌ కేంద్రంలో సిబ్బందికి అవసరమైన అన్నిసదుపాయాలు కల్పించామ న్నారు. మీడియాసెంటర్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఓట్లలెక్కింపులో ఆసిఫా బాద్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ కొరకు 16టేబుళ్లు, సిర్పూర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ కొరకు 14 టేబుళ్లు ఏర్పాటు చేశామన్నారు. 23రౌండ్ల ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపారు. ఇందు కోసం రిజర్వ్‌, సీలింగ్‌సిబ్బంది కలుపుకొని సుమారు 300మంది కౌంటింగ్‌ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఈ క్రమంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు అన్నిఏర్పాట్లు చేశామ న్నారు. కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2024 | 10:53 PM