Share News

Kumaram Bheem Asifabad: వర్షం.. ఈదురు గాలుల బీభత్సం

ABN , Publish Date - May 12 , 2024 | 11:08 PM

ఆసిఫాబాద్‌, మే 12: జిల్లావ్యాప్తంగా ఆదివారం ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురిసింది. దీంతో ఈదురుగాలులకు ఆయా మండలాల్లో చెట్లు, విద్యుత్‌స్తంభాలు విరిగిపడ్డాయి. వర్షం కురి యడంతో పోలింగ్‌ సిబ్బంది పోలింగ్‌కేంద్రాలకు చేరుకునేందుకు ఇబ్బందులుపడ్డారు.

Kumaram Bheem Asifabad:  వర్షం.. ఈదురు గాలుల బీభత్సం

- నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు, వృక్షాలు

- ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రంలో నేలకొరిగిన టెంట్లు

- పోలింగ్‌ బూత్‌ల ఎదుట చేరిన వరద నీరు

- ఇబ్బందులు పడ్డ ఎన్నికల సిబ్బంది

ఆసిఫాబాద్‌, మే 12: జిల్లావ్యాప్తంగా ఆదివారం ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురిసింది. దీంతో ఈదురుగాలులకు ఆయా మండలాల్లో చెట్లు, విద్యుత్‌స్తంభాలు విరిగిపడ్డాయి. వర్షం కురి యడంతో పోలింగ్‌ సిబ్బంది పోలింగ్‌కేంద్రాలకు చేరుకునేందుకు ఇబ్బందులుపడ్డారు. జిల్లా కేంద్రంలో ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షా నికి పలుచోట్ల చెట్లు విరిగిపడగా విద్యుత్‌ స్తంభా లు నేలకొరిగాయి. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంత రాయం ఏర్పడింది. ఆసిఫాబాద్‌పట్టణంలోని పీటీజీ బాలుర పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్ని కల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద ఈదురు గాలు లకు టెంట్లు కూలిపోయాయి. టెంట్లు కూలిన సమ యంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. టెంట్లు పూర్తిగా నేలకొరగడంతో ఎన్నికల రిజర్వు సిబ్బంది వరండాలలో తలదాచుకుని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎం పంపిణీ పూర్తయ్యాక వర్షం కురియ డంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. లేనిపక్షంలో సిబ్బందితోపాటు ఎన్నికల సామగ్రి తడిసేది. ఇదిలా ఉండగా ఆసిఫాబాద్‌ పట్టణంలోని జడ్పీ బాలుర పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన నాలుగు పోలింగ్‌ బూత్‌లలోకి భారీవర్షం కార ణంగా వరదనీరు వచ్చి చేరింది. దీంతో పోలింగ్‌ కేంద్రాల వద్ద వరదనీరు చెరువులను తలపించా యి. అదేపోలింగ్‌ బూత్‌లలో ఆదర్శపోలింగ్‌ కేంద్రా న్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు షామి యానాలు సిద్ధం చేయగా ఈదురు గాలులతో పనులకు ఆటంకం ఏర్పడ్డాయి. వరదనీటిని దాట లేక పోలింగ్‌సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చిల్డ్రన్స్‌పార్కు సమీ పంలో ఈదురుగాలులతో టేలా ఎగిరిపడి రోడ్డుపై పడిపోయింది. ఎన్నికల సామగ్రి పంపిణీకేంద్రం వద్ద వరద నీటితో నిండిపోయి చెరువును తల పించింది. అదేవిధంగా ఆయా మండలాల్లో కురిసిన వర్షానికి పోలింగ్‌ సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు తరలి వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈదురుగాలులు, వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో కొన్ని కేంద్రాల్లో పోలింగ్‌ సిబ్బంది చీకటిలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొ న్నది. ఆసిఫాబాద్‌ మండలంలోని గుండి వాగు తాత్కాలిక వంతెన భారీ వర్షానికి కొట్టుకుపోయింది. దీంతో పోలింగ్‌సిబ్బంది వాంకిడి మండలం కన్నర్‌గాం మీదుగా గుండి పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్నారు. తుంపెల్లి గ్రామంలో ఇంటిపై చెట్టు పడింది. అదృష్టవశాత్తు అందులో నిదిరిస్తున్న ఇద్దరికి ఎలాంటి గాయాలు కాలేదు. క్షేమంగా బయటపడ్డారు.

సిర్పూర్‌(యు): మండలంలోని ఆయాగ్రామాల్లో ఆదివారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురి సింది. నాలుగైదు రోజులుగా మండ లంలో ఓమోస్తరు వర్షం కురుస్తుం డగా ఆదివారం భారీగా వర్షం పడిం ది. దాదాపు రెండు గంటలపాటు వర్షం పడింది. దీంతో వాతావరణం చల్లబడింది. వర్షం భారీగా పడడంతో ఇండ్లలోకి వరద నీరు చేరింది.

దహెగాం: మండల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం వర్షం కురి సింది. మండలంలోని ఇట్యాల గ్రామంలో ఏర్పాటుచేసిన మోడల్‌ పోలింగ్‌ కేంద్రం గాలివానకు కూలి పోయింది. అదేవిధంగా కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. టార్పా లిన్‌ కవర్లు కప్పే ప్రయత్నం చేసినప్ప టికీ ధాన్యం కొట్టుకుపోయి రైతులు ఇబ్బందులు పడ్డారు.

కాగజ్‌నగర్‌: కాగజ్‌నగర్‌పట్టణంలో ఆదివారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురియటంతో పట్టణ ప్రజలు ఇబ్బందులుపడ్డారు. సాయంత్రం ఐదు నుంచి మొదలైన వర్షం రాత్రి ఏడుగంటల వరకు కురిసింది. ఈదురు గాలులు అధికంగా వీచ డంతో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. దీంతో పట్టణంలో అంధ కారం నెలకొంది. సాయంత్రం పూట నిర్వహించే చిరు దుకాణాల కవర్లు లేచిపోయాయి.

Updated Date - May 12 , 2024 | 11:08 PM