Share News

Kumaram Bheem Asifabad: పల్స్‌ పోలియో విజియవంతం చేయాలి: డీఎంహెచ్‌వో

ABN , Publish Date - Feb 28 , 2024 | 10:41 PM

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 28: ఏప్రిల్‌ 3న నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి తుకారాంభట్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో పల్స్‌పోలియో కార్యక్రమ నిర్వహణపై జిల్లా గ్రామీ ణాభివృద్ధి శాఖ, జిల్లా సంక్షేమశాఖ, జిల్లా గిరిజన అభివృద్ధిశాఖ, జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Kumaram Bheem Asifabad:   పల్స్‌ పోలియో విజియవంతం చేయాలి: డీఎంహెచ్‌వో

-డీఎంహెచ్‌వో తుకారాం భట్‌

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 28: ఏప్రిల్‌ 3న నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి తుకారాంభట్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో పల్స్‌పోలియో కార్యక్రమ నిర్వహణపై జిల్లా గ్రామీ ణాభివృద్ధి శాఖ, జిల్లా సంక్షేమశాఖ, జిల్లా గిరిజన అభివృద్ధిశాఖ, జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాతూ ఏప్రిల్‌ 3న జిల్లాలో నిర్వహించనున్న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని, జిల్లాను పోలియో రహిత జిల్లాగా తీర్చిదిద్దానలి కోరారు .జిల్లాలో 0-5 సంవత్సరాల పిల్లలు 57,362 మంది ఉన్నారని, వీరందరికి వాక్సినేషన్‌ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వ్యాక్సినేషన్‌ కొరకు 672కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 78మంది సూపర్‌వైజర్లను నియమించడంతోపాటు 22మొబైల్‌ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లాలోని బస్టాండు, రైల్వేస్టేషన్లలో వ్యాక్సినేషన్‌కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు. 3న వ్యాక్సినే షన్‌ కానీ పిల్లల కోసం 4,5 తేదీల్లో ప్రతిఇంటిని సందర్శించి పిల్లలకు వ్యాక్సినేషన్‌ అందించడం ద్వారావందశాతం కార్యక్రమాన్ని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. సంబంధిత అధికారులు, ఐసీడీఎస్‌, ఐకేపీ, మెప్మా, సహాయసిబ్బంది సమన్వయంతో విజయవంతంచేయాలని తెలిపారు. ఈ కార్యక్ర మంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్‌, గిరిజనాభివృద్ధి అధికారిణి రమాదేవి, సంక్షేమ శాఖాధికారి భాస్కర్‌, విద్యాశాఖపరీక్షల కమీషనర్‌ ఉదయ్‌బాబు, డిస్ట్రిక్ట్‌ ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ సిద్దార్థ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 10:41 PM