Share News

Kumaram Bheem Asifabad : ప్రజాపాలన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

ABN , Publish Date - Jan 05 , 2024 | 11:19 PM

ఆసిఫాబాద్‌, జనవరి 5: ప్రజాపాలనలో భాగంగా వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి డాటా ఎంట్రీఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.

Kumaram Bheem Asifabad : ప్రజాపాలన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి

- కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే

ఆసిఫాబాద్‌, జనవరి 5: ప్రజాపాలనలో భాగంగా వచ్చిన ప్రతి దరఖాస్తును పరిశీలించి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి డాటా ఎంట్రీఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సంద ర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డిసెంబరు 28నుంచి ఈ నెల 6వరకు కొనసాగుతున్న ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను డాటాఎంట్రీ ఆపరేటర్లు పరిశీలించి దర ఖాస్తులో ఉన్న పూర్తిసమాచారాన్ని ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. నమోదు చేసిన సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. దరఖాస్తుదారుల ఆధార్‌ కార్డు, రేషన్‌ కార్డు, మొబైల్‌ నెంబర్లతో పాటు దరఖాస్తుదారుడు నింపిన సమాచారాన్ని మాత్రమే ఆప్‌లోడ్‌ చేయాలని తెలిపారు. దరఖాస్తు వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు పూర్తైన తరువాత సంబంధిత దరఖాస్తుడారుడి ఫోన్‌కు సందేశం వెళ్తుందన్నారు. ఈ నెల 6నుంచి 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో నమోదుప్రక్రియ పూర్తిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాపంచా యతీ అధికారి ఉమర్‌హుస్సేన్‌, ఎంపీడీవోలు, కార్యదర్శులు, డాటాఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు.

Updated Date - Jan 05 , 2024 | 11:19 PM