Share News

Kumaram Bheem Asifabad:సహాయక పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తి సౌకర్యాల ఏర్పాటు

ABN , Publish Date - Apr 18 , 2024 | 11:04 PM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 18: లోక్‌సభ ఎన్నికల నేప థ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన సహాయక పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

Kumaram Bheem Asifabad:సహాయక పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తి సౌకర్యాల ఏర్పాటు

- కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 18: లోక్‌సభ ఎన్నికల నేప థ్యంలో జిల్లాలో ఏర్పాటు చేసిన సహాయక పోలింగ్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, దాసరి వేణుతో కలిసి సిర్పూర్‌, ఆసిఫాబాద్‌ శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని తహసీల్దా ర్‌లు, ఎన్నికల అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మాట్లాడుతూ పార్ల మెంట్‌ నియోజకవర్గ ఎన్నికల్లో భాగంగా ఆదిలా బాద్‌(001) నియోజకవర్గపరిధిలోని జిల్లాలోని సిర్పూర్‌(001), ఆసిఫాబాద్‌(005)శాసనసభ నియో జకవర్గ పరిధిలో మే13న జరుగనున్న పోలింగ్‌ప్రక్రి యలో భాగంగా పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించా లని తెలిపారు. తాగునీరు, విద్యుత్‌ సరఫరా, ఫ్యాన్లు, మూత్రశాలలు, నీడ తదితర సౌకర్యాల కల్పనతో పాటు వయోవృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులకు ర్యాంపులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఓటరు జాబితాపై పోలింగ్‌ కేంద్రం వివరాలు చిరునామా సరి చూసుకోవాలని ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరి చేయాలని తెలిపారు. వేసవి ఉష్ణోగ్రత దృష్ట్యా ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు తప్పని సరిగా అందుబాటులో ఉంచాలన్నారు. పోలింగ్‌ విధులలో ఉన్న సిబ్బందికి అన్ని మౌలిక వసతులు కల్పించాలన్నారు. మహిళాసిబ్బంది, దివ్యాంగ ఓట ర్లకు ప్రత్యేకఏర్పాట్లు చేయాలని తెలిపారు. తహసీ ల్దార్లు తమపరిధిలోని ప్రతిపోలింగ్‌ కేంద్రాన్ని సంద ర్శించి పూర్తివివరాలతో నివేదిక సమర్పించాలన్నారు. సెక్టార్‌ అధికారులు, బూత్‌స్థాయి అధికారులు, సూపర్‌వైజర్లతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా కృషిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లారెవెన్యూ అధికారి లోకేశ్వర్‌రావు, కాగజ్‌నగర్‌ ఆర్డీవోసురేష్‌, తహసీల్దార్‌ ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

నామినేషన్‌ను పకడ్బందీగా నిర్వహించాలి

పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా నామినేషన్‌ స్వీకరణను పకడ్బంధీగా నిర్వహించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. ఆదిలాబాద్‌(001) పార్ల మెంట్‌ నియోజకవర్గ పరిధిలోని జిల్లాలోని సిర్పూర్‌ (001), ఆసిఫాబాద్‌(005) అసెంబ్లీ నియోజకవ ర్గాలలో ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ క్రమంలో ఈనెల 25వరకు (ప్రభుత్వ సెలవు రోజులు మినహాయించి) ప్రతి రోజు ఉదయం 11నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఆదిలాబాద్‌లోని రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌, సహాయరిటర్నింగ్‌ అధికారి, రెవెన్యూ డివిజనల్‌ అధికారి ఆదిలాబాద్‌కు రాజకీయపార్టీలు, అభ్యర్థులు తమ నామినేషన్‌ సమర్పించ వచ్చన్నారు. నామినేషన్‌ ఫారాలను నిర్దేశిత పని వేళలలో పొందవచ్చని తెలిపారు. ఈనెల 26తేదీ ఉదయ 11గంటల నుంచి రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టర్‌ ఆదిలాబాద్‌లో నామినేషన్ల పరిశీలన జరుగుతుందన్నారు. అభ్య ర్థిత్వం ఉపసంహరించుకొను నోటీ సును అభ్యర్థి స్వయంగా కానీ, ప్రతి పాదకులచేకానీ, ఎన్నికల ఏజెంట్‌కు కానీ అభ్యర్థి చేత రాత పూర్వకంగా ఈనెల29తేదీ మధ్యాహ్నం 3గంటలలోగా అందజేయవచ్చని తెలి పారు. తుదిజాబితా అనంతరం మే13న ఉదయం 7నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ నిర్వ హిస్తామని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిసౌకర్యాలు కల్పిస్తామన్నారు. పోలింగ్‌రోజున ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపుకార్డులలో ఏదైనా ఉపయోగించుకొని ఓటు వేయవచ్చని తెలిపారు.

కలెక్టరేట్‌లో తాగునీటి ప్లాంటు ఏర్పాటు

వేసవిదృష్ట్యా వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్‌కి వచ్చే ప్రజలు కార్యాలయంలోని అధి కారులు, సిబ్బంది కొరకు తాగునీటి ప్లాంటు ఏర్పాటు చేశామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన తాగునీటి ప్లాంట్‌ను ఆయన అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా ప్రజలసౌకర్యార్థం ఈ తాగునీటి ప్లాంటు ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - Apr 18 , 2024 | 11:04 PM