Kumaram Bheem Asifabad: రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
ABN , Publish Date - Oct 20 , 2024 | 10:57 PM
ఆసిఫాబాద్ రూరల్/తిర్యాణి/కెరమెరి/వాంకిడి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు రైతు భరోసాపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం ఆపార్టీనాయకులు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ నాయకుల నిరసన
ఆసిఫాబాద్ రూరల్/తిర్యాణి/కెరమెరి/వాంకిడి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు రైతు భరోసాపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆదివారం ఆపార్టీనాయకులు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈసందర్భంగా జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా రైతులకు కాంగ్రెస్ ఇచ్చినహామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మంత్రి రైతుభరోసాపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏహామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదన్నారు. రైతులకు అండగా ఉంటా మని రైతు ప్రభుత్వమని చెబుతున్న కాంగ్రెస్ పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయలేదన్నారు. దానికితోడు రైతుభరోసా నిధులు విడుదల చేయలేదన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు యాసంగి సీజన్‌వరకు పంటవివరాలను సేకరించి రైతుభరోసా వేస్తామని ప్రకటిం చడం రైతులు పెట్టకున్న నమ్మకాన్ని వమ్ము చేయడమేనని అన్నారు. పేద ప్రజలకు వచ్చే అనేకపథకాల్లో కోతపెట్టారని ఆరోపించారు. బాలింతలకు ఉపయోగకరంగా ఉండే కేసీఆర్ కిట్, రక్తహీనత నివారించే న్యూట్రిషన్‌కిట్, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆర్టీసీకార్మికుల విలీనం, ప్రభుత్వఉద్యోగుల పీఆర్సీ ఇలా అనేక సంక్షేమ పథకాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఆరోపించారు. ప్రభుత్వపాఠశాలల్లో తాము ప్రవేశపెట్టిన అల్పాహార పథకాన్ని కొన సాగించాలన్నారు.