Share News

Kumaram Bheem Asifabad: అండర్‌ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

ABN , Publish Date - Feb 26 , 2024 | 10:34 PM

కాగజ్‌నగర్‌, ఫిబ్రవరి 26: కాగజ్‌నగర్‌ అండర్‌ బ్రిడ్జిని ప్రధాని మోదీ వర్చువల్‌గా సోమవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే మాట్లాడుతూ రైల్వే పనులు త్వరితగతిన జరగడం శుభపరిణామన్నారు.

Kumaram Bheem Asifabad:  అండర్‌ బ్రిడ్జిని ప్రారంభించిన ప్రధాని మోదీ

కాగజ్‌నగర్‌, ఫిబ్రవరి 26: కాగజ్‌నగర్‌ అండర్‌ బ్రిడ్జిని ప్రధాని మోదీ వర్చువల్‌గా సోమవారం ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే మాట్లాడుతూ రైల్వే పనులు త్వరితగతిన జరగడం శుభపరిణామన్నారు. కాగజ్‌నగర్‌ రైల్వేట్రాక్‌కు అండర్‌బ్రిడ్జి నిర్మించటంతో పలు గ్రామాలవాసులకు నేరుగా వెళ్లేందుకు చక్కటి అవకాశం ఉందన్నారు. జడ్పీ ఇన్‌చార్జీ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు మాట్లాడుతూ రైల్వే ఆఽధునీకరణ పనుల్లో భాగంగా అండర్‌ బ్రిడ్జినిర్మాణం పూర్తికావటం గొప్ప విషయమన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశంలోని రైల్వేస్టేషన్ల ఆధునీకీకరణకు శ్రీకారం చుట్టారని అన్నారు. ఈసందర్భంగా వకృత్వ పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్‌ డివిజనల్‌ సిగ్నల్‌, టెలికమ్యూనికేషన్‌ ఇంజనీర్‌ సాయికిరణ్‌, చీఫ్‌ కమర్షియల్‌ ఇన్‌స్పెక్టర్‌ కైలాష్‌, సీనియర్‌ సెక్షన్‌ ఇంజనీర్‌ ఓం ప్రకాష్‌, భాస్కర్‌, రవిప్రసాద్‌, సంతోష్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 26 , 2024 | 10:34 PM