Kumaram Bheem Asifabad : ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్
ABN , Publish Date - Jul 08 , 2024 | 11:21 PM
ఆసిఫాబాద్, జూలై 8: ప్రజా వాణి దరఖాస్తులను త్వరగా పరి ష్కరించే విధంగా చర్యలు తీసుం టామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.

- కలెక్టర్ వెంకటేష్ దోత్రే
ఆసిఫాబాద్, జూలై 8: ప్రజా వాణి దరఖాస్తులను త్వరగా పరి ష్కరించే విధంగా చర్యలు తీసుం టామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ దీపక్ తివారి, దాసరి వేణు, ఆర్డీ వోలు లోకేశ్వరరావు, సురేష్‌తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కాగజ్‌నగర్ మండ లం చింతగూడకు చెందిన శంకర్ తనకు వికలాంగ పెన్షన్ మంజూరు చేయాలని దరఖాస్తుఅందజేశారు. కెరమెరి మండలం గౌరి గ్రామానికి చెందిన సావిత్రిబాయి తన భర్త మరణించడంతో ఆయన పేరిట గల అటవీహక్కు పత్రాన్ని తనపేరుపై మార్పిడి చేయాలని, వాంకిడి మండలం ఖమాన గ్రామానికి చెందిన రాజబోయిన రాజన్న తన పేరిటగల భూమిని ఆన్‌లైన్‌లో నమోదు చేసి పాస్‌పుస్తకాలు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. కాగజ్‌నగర్ మండలం దుర్గానగర్ గ్రామానికి చెందిన సుమిత్ర సర్కార్ ఉపాధి కొరకు చౌకధరల దుకాణం మంజూరు చేయాలని, చింతల మానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన సోంబాయి తనపేరిట గ్రామశివారులో ఉన్న పట్టా భూమిని కొందరు అక్రమంగా ఆక్రమించుకు న్నారని ఈ విషయంలో విచారించి తనకు న్యాయం చేయా లని దరఖాస్తు చేసుకున్నారు. ఆసిఫాబాద్ మండలం ఈదులవాడకు చెందిన మంజుల చేపల పెంపకం కొరకు అన్ని అర్హతలు ఉన్నాయని, మహిళాశక్తి పథ కం ద్వారా ఆర్థిక సహాయం అందజేయాలని, దహె గాం మండలం గెర్రె గ్రామానికి చెందిన నానయ్య తన పేరిట ఉన్న భూమికి కొందరు ఆక్రమించుకుని ఇల్లు నిర్మించుకుంటామని బెదిరిస్తున్నారని ఈ విషయమై తనకు రక్షణ కల్పిస్తూ న్యాయం చేయా లని దరఖాస్తు సమర్పించారు. అలాగే మరికొంత మంది వివిధ సమస్యలపై కలెక్టర్‌కు దరఖాస్తు చేరుసుకున్నారు.
ఇంటింటా ఇన్నోవేటర్‌తో
నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం
ప్రభుత్వం చేపట్టిన ఇంటింటా ఇన్నోవేటర్-2024 కార్యక్రమం ద్వారా గ్రామీణప్రాంతాల నుంచి ప్రజా ఉపయోగకరమైన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్ట రేట్‌లో ఆయన అధికారులతో కలిసి ఇంటింటా ఇన్నో వేటర్ కార్యక్రమం గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ఆవిష్కర్తలకు సాధికార కల్పిస్తామన్నారు. అద్భుతమైన ఆలోచనలు, ప్రాజెక్టులు రూపొందించిన అన్నివర్గాల ఆవిష్కర్తల నుంచి ఆవిష్కరణలను స్వీకరిస్తామన్నారు. గొప్ప ఆవిష్కరణలను ఎంపిక చేసి ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అవార్డు ప్రదానం చేస్తామ న్నారు. ఆవిష్కర్తలు దరఖాస్తులను నేరుగా వాట్సాప్ ద్వారా 9100678543 నెంబరుకు పంపించవచ్చన్నారు.