Kumaram Bheem Asifabad: శాంతియుత వాతావరణం కోసం పోలీసుల కృషి
ABN , Publish Date - Oct 21 , 2024 | 11:06 PM
కాగజ్‌నగర్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): సమాజంలో శాంతియుత వాతావరణం కోసం పోలీసులు కృషి చేస్తున్నారని రూరల్‌సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు.
-సీఐ శ్రీనివాస్ రావు
కాగజ్‌నగర్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): సమాజంలో శాంతియుత వాతావరణం కోసం పోలీసులు కృషి చేస్తున్నారని రూరల్‌సీఐ శ్రీనివాస్‌రావు తెలిపారు. సోమవారం రాత్రి కాగజ్‌నగర్ మండలం రేగులగూడలో గిరిజనుకు బ్లాంకెట్స్, రేషన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల త్యాగాల గుర్తు చేసుకునేందుకు పోలీసు అమర వీరుల దినోత్సవాలను జరుపుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మహేందర్, సిబ్బంది పాల్గొన్నారు.
పోలీస్ హౌజ్: కాగజ్‌నగర్ పట్టణంలో సోమవారం పోలీస్‌హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ శంకరయ్య మాట్లాడుతూ శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు ముందుంటా రన్నారు. ప్రజల భద్రతకోసం పోలీ సులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రక్షిస్తున్నట్టు తెలిపారు. ఈసందర్భంగా వివిధ తుపాకులను వాడే తీరును వివరించారు. కార్యక్రమంలో ఎస్సైలు సాగర్, దీకొండరమేష్,సిబ్బందిపాల్గొన్నారు.
ఘనంగా పోలీసు
అమరవీరుల దినోత్సవం
కౌటాల: మండల కేంద్రంలో సోమవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఎస్సై మధుకర్ ఆధ్వర్యంలో పోలీసు అమర వీరులకు నివాళులు అర్పించి మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్ నుంచి ప్రధానరహదారి గుండా విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహిం చారు. పోలీసుల సేవలు మరువలేనవని అన్నారు. విధి నిర్వహణలో అమ రులైన పోలీసుల త్యాగాలను గుర్తుకు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యా యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.