Kumaram Bheem Asifabad: కన్నుల పండువగా పోచమ్మ బోనాలు
ABN , Publish Date - Jul 28 , 2024 | 10:57 PM
కాగజ్‌నగర్, జూలై 28: పట్టణంలో ఆది వారం పోచమ్మ బోనాల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నల్లపోచమ్మ ఆలయంలో బోనాల పండుగను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు.
-శివసత్తుల నృత్యాలతో అట్టహాసంగా సాగిన పండుగ
కాగజ్‌నగర్, జూలై 28: పట్టణంలో ఆది వారం పోచమ్మ బోనాల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నల్లపోచమ్మ ఆలయంలో బోనాల పండుగను నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా అమ్మవారికి మాజీ ఎమ్మెల్యేకోనప్ప సతీమణి కోనేరు రమాదేవి, మాజీఇన్‌చార్జీ జడ్పీచైర్మన్ కోనేరు కృష్ణారావు, కాంగ్రెస్‌పార్టీ సిర్పూరు నియోజకవర్గ ఇన్‌చార్జి రావిశ్రీనివాస్ పట్టువస్త్రాలను సమర్పించారు. పూజలునిర్వహించారు. సాయం త్రం లారీచౌరస్తా నుంచి బోనాల శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభమైంది. శివసత్తులు బోనాలను నెత్తిన పెట్టుకొని నృత్యాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సీఐ శంకరయ్య గట్టి బందోబస్తు నిర్వహించారు. మండలంలోని డాడానగర్ చౌర స్తాలోగల పోచమ్మ ఆలయంలో బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీఎమ్మెల్యే కోనేరుకోనప్ప సతీమణి కోనేరు రమాదేవి, మాజీఇన్‌చార్జీ జడ్పీచైర్మన్ కోనేరు కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ సిర్పూరు నియోజవకర్గ నాయకుడు రావిశ్రీనివాస్ పూజలు నిర్వహించారు. అనంతరంప్రసాదవితరన చేశారు.
రెబ్బెన/చింతలమానేపల్లి/ఆసిఫాబాద్ రూరల్/కౌటాల: రెబ్బెనలో ఆదివారం రేణుక ఎల్లమ్మ బోనాలను ఎస్సీ సామాజికవర్గం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చింతల మానేపల్లి మండలంలోని బారెగూడ, డబ్బా గ్రామల్లో మాలిసంఘం ఆధ్వర్యంలో మహి ళలు బోనాలతో పోచమ్మ ఆలయానికి వెళ్లి ప్రత్యేకపూజలు నిర్వహించి బోనాలను సమ ర్పించారు. ఆసిఫాబాద్ పట్టణంలో, కౌటాలలో ఆషాడ మాసం చివరి ఆదివారం కావడంతో పోచమ్మ ఆలయంలో భక్తులు మొక్కలు సమర్పించారు. దీంతో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.