Kumaram Bheem Asifabad: బస్సుల కోసం ప్రయాణికుల నిరీక్షణ
ABN , Publish Date - May 12 , 2024 | 11:12 PM
ఆసిఫాబాద్, మే 12: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రయాణికులకు సరిపడ బస్సులు లేకపోవడంతో దూరప్రాంతాలకువెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు.

ఆసిఫాబాద్, మే 12: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రయాణికులకు సరిపడ బస్సులు లేకపోవడంతో దూరప్రాంతాలకువెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో బస్సుల కోసం ప్రయా ణికులు గంటల తరబడి వేచి చూశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఆర్టీసీ బస్సులన్నీ పోలింగ్ సిబ్బందిని తరలించేం దుకు ఉపయోగించారు. దీంతో కొన్ని బస్సులు మాత్రమే షెడ్యూల్ ప్రకారం నడవగా అవి సరిపోకపోవడంతో ప్రయాణి కులు ఇబ్బందులుపడ్డారు.