Share News

Kumaram Bheem Asifabad: పార్లమెంట్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి

ABN , Publish Date - Apr 08 , 2024 | 10:49 PM

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 8: లోక్‌సభ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషిచేయాలని జిల్లా ఎన్నికలఅధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అన్నారు. సోమ వారం కలెక్టరేట్‌లో పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని సిర్పూర్‌(001), ఆసిఫాబాద్‌(005) శాసనసభ నియోజక వర్గాల్లో నియమించిన సెక్టార్‌ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Kumaram Bheem Asifabad:  పార్లమెంట్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలి

- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, ఏప్రిల్‌ 8: లోక్‌సభ ఎన్నికలు జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషిచేయాలని జిల్లా ఎన్నికలఅధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అన్నారు. సోమ వారం కలెక్టరేట్‌లో పార్లమెంట్‌ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని సిర్పూర్‌(001), ఆసిఫాబాద్‌(005) శాసనసభ నియోజక వర్గాల్లో నియమించిన సెక్టార్‌ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కార్యచరణ విడుదల అయిన తేదీ నుంచి అధికారులు తమకు కేటాయించిన విధులను బాధ్యతగా నిర్వహించాలన్నారు. ఎన్నికల మొదలు నుంచి పోలింగ్‌ ప్రక్రియ ముగింపువరకు సెక్టార్‌ అధికారుల పాత్ర కీలకమైనదన్నారు. వేసవిదృష్ట్యా అధికఉష్ణోగ్రత ఉన్నందున ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. పోలింగ్‌ ప్రారంభానికి ముందే మాక్‌పోలింగ్‌ నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు ప్రతిరెండు గంటలకు ఒకసారి పోలింగ్‌శాతాన్ని సహాయఎన్నికల అధికారులకు తెలియజే యాలన్నారు. ఎన్నికలప్రక్రియ సజావుగా సాగేలా కృషి చేయాలన్నారు. సమావేశంలో అదనపుకలెక్టర్‌లు దీపక్‌ తివారి, దాసరి వేణు, ఆర్డీవోలు లోకేశ్వర్‌రావు, సురేష్‌, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారిరమాదేవి, మాస్టర్‌ట్రైనర్లు, తహసీ ల్దార్‌, సెక్టార్‌అధికారులు, ఎన్నికలవిభాగం అధికారులు పాల్గొన్నారు.

ప్రజలకు అందుబాటులో ఉండాలి..

తిర్యాణి: ప్రజలకుఅధికారులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. తిర్యాణి ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి, వైద్యసిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరికీ తాగునీటి సమస్య లేకుండా చూడాలని మిషన్‌భగీరథ అధికారులు, కార్యదర్శులను ఆదేశించారు. ప్రతికూలీకి ఉపాధిహామీ పథకం అందేవిధంగా సిబ్బందిచర్యలు చేపట్టాలన్నారు. ఎండాకాలంలో ప్రజలకువచ్చే ఆరోగ్యసమస్యల పట్ల వైద్య బృందాలు అప్రమత్తంగా ఉండాలని అడిషనల్‌ డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్‌కు సూచించారు. అనంతరం ఐకేపీ ఆధ్వర్యం లో పాఠశాలల విద్యార్థులకు దుస్తులను కుట్టే అవకాశాన్ని మహిళా సంఘాలకు ఇస్తామన్నారు. ఈసందర్భంగా ఆటో డ్రైవర్లు రోడ్డు బాగుచేయాలని వినతిపత్రం అందజేశారు. మండల కేంద్రంలో ఆర్‌ఐ బిల్డింగ్‌తోపాటు ఏఎన్‌ఎం సబ్‌ సెంటర్‌నుఆక్రమించిన వారిపైచర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో అదనపుకలెక్టర్‌ దీపక్‌ తివారి, డీపీవో సుదర్శణ్‌గౌడ్‌, డీఎల్‌పీవో సురేందర్‌, తహసీ ల్దార్‌ సంజుకుమార్‌, ఎంపీడీవోమల్లేష్‌, ఎంపీవో సుధాకర్‌రెడ్డి, ఏపీఎం సదానందం, ఏవో తిరుమ లేశ్వర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 10:49 PM